తెలంగాణ

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: వీణవంకలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై జిల్లా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న తరుణంలో మరో ఘోరం జరిగింది. కాటారం మండలం దామెరకుంట గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ప్రాణాలు తీసిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. కాటారంలో హోం గార్డుగా పనిచేస్తున్న రాజాస్వామి కుమార్తె శనివారం నుంచి కనిపించడం లేదు. నాలుగేళ్ల ఆ బాలిక పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. జక్కు వెంకటస్వామి అనే వ్యక్తిని అనుమానించి అతని ఇంట్లో గాలించగా బాలిక మృతదేహం లభించింది. వెంకటస్వామి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.