రుచి

ఆకులో ఆకునై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో నాగరికత వెల్లివిరుస్తున్నా ప్రకృతిని ఆరాధించటం మన సంస్కృతిలో భాగమైంది. వేళ్ల సంవత్సరాల చరిత్ర కలిగిన మహావృక్షం రావిచెట్టు. ఈ చెట్టును పవిత్ర వృక్షంగా భావిస్తున్నామంటే ఇందులో ఉండే ఔషధ గుణాలే కారణం. పాము కాటు నుంచి ఉబ్బసం, చర్మ, మూత్రపిండాల వ్యాధులు, మలబద్దకం, విరేచనాలు, నపుంసకత్వం, వివిధ రక్త సంబంధ సమస్యలెన్నింటినో రావిచెట్టు ఆకుతో సైతం తొలగించుకోవచ్చు. అనేక జబ్బుల నుంచి బయటపడేసేందుకు రావిచెట్టును ఔషధంగా వినియోగిస్తున్నట్లు ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని పతంజలి ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ తెలియజేస్తున్నారు. రావిఆకులో గ్లూకోజ్, ఆస్టిరియోడ్, ఫినోలిక్ అనే గుణాలు ఇమిడి ఉన్నాయి. దీని బెరడులో సైతం విటమిన్ కె, ఫాస్టోస్టెరోలిన్లో అధికంగా ఉన్నాయి. ఈ పదార్థాలన్నీ రావిచెట్టులో ఉండటం వల్ల అసాధారమైన ఔషధ గుణాల చెట్టుగా విరాజిల్లుతుంది. రావిచెట్టులోని ప్రతి భాగం కూడా జబ్బుల నివారణకు ఉపకరిస్తుంది. ఆకు, బెరడు, కాండం, విత్తనాలు, పండు..ఇలా అన్ని భాగాల్లోనూ అనేక ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. పురాతన కాలం నుంచి ఈ చెట్టును అనేక వ్యాధులను దూరం చేసేందుకు వాడుతున్నారు.

రక్తస్రావానికి చికిత్స

రక్తస్రావానికి మంచి చికిత్సాకారిణిగా ఉపకరిస్తుంది. రావి ఆకు, ధనియాలు, స్పటిక, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని వాటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే రక్తస్రావాన్ని అరికట్టడం సులువు. అలాగే రావి పండ్లు తింటే కూడా ఎన్నో ప్రయోజనాలు. పండిన పండ్లు తినటం వల్ల దగ్గు, వాంతులు తదితర వాటిని నివారించుకోవచ్చు. ప్రతిరోజూ పండు తిన్నా రక్త సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

కడుపునొప్పి నివారిణి

రావి మొక్క ఆకులు రెండు నుంచి ఐదింటిని తీసుకుని పేస్ట్‌గా చేసుకోండి. ఈ పేస్ట్‌లో బెల్లం కలపండి. ఈ మిశ్రమాన్ని చిన్న మాత్రలుగా తయారుచేసుకుని రోజుకు మూడు లేదా నాలుగుసార్లు తీసుకుంటే కడుపునొప్పి ఉపశమనానికి ఉపకరిస్తోంది.

ఆస్మాకు చికిత్స

రావి మొక్క, దాని పండ్లు, బెరడును తీసుకోండి. వాటిని ఎండబెట్టి విడివిడిగా పొడి చేసి పెట్టుకోండి. వాటిని సమాన పరిమాణంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఆస్మాను దూరం చేసుకోవచ్చు. అలాగే రావి ఆకు పొడిని పండ్ల పొడిగా ఉపయోగించుకున్నా మంచిదే. ఈ పొడిని మూడు గ్రాములు తీసుకుని నీటిలో కలుపుకుని రోజుకు రెండుసార్లు తాగినా సమర్థవంతంగా పనిచేస్తుంది.

పాముకాటుకు చికిత్స..

పాముకాటుకు చక్కగా పనిచేస్తుంది. రావి ఆకుల సారాన్ని రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుంటే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.

తామర, దురద పోగొడుతుంది..

రావిచెట్టు లేత ఆకులను తింటే చర్మంపై వచ్చే దురద, ఇతర చర్మ వ్యాధుల దూరమవుతుయి. ఈ ఆకు సారాన్ని తీసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాల్చిన రావి బెరడు పొడిలో నిమ్మ, నెయ్యి కలిపి ఈ మిశ్రమాన్ని పేస్ట్‌గా తయారుచేసుకోండి. చర్మంపై ఏర్పడిన తామరపై రాయండి. దీంతో పాటు ఈ ఆకుతో తయారుచేసిన టీ తీసుకుంటే చర్మ సమస్యలు రానేరావు. అలాగే చేతులు, కాళ్ల పగుళ్ల ఉన్నచోట రావి ఆకు పాలను రాస్తే పగుళ్లు మటుమాయం అవుతాయి.

రక్తాన్ని శుద్ధిచేస్తుంది..

రావిచెట్టు గింజల పొడిని రెండు గ్రాములు తీసుకోండి. ఈ పొడిని తేనెతో కలుపుకుని రెండుసార్లు తీసుకుంటే గ్యాస్ట్రిక్, రక్త సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. అలాగే రోజు ఐదు నుంచి పది పండ్లు తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు.

మధుమేహ నివారిణి..

రావి ఆకులు మూడు లేదా నాలుగు ఆకులు తీసుకోండి. పొడి చేసిన తరువాత 250 మిల్లీ లీటర్ల నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేయండి. ఈ నీటిని తాగితే చాలు. అంతేకాదు కామెర్ల రోగికి ఐదు రోజులు ఇచ్చినా మంచి ప్రభావంతంగా పనిచేస్తుంది. ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినా ఈ బెరడు పొడిని నీటిలో కలుపుకుని తాగితే చాలు. ఈ ఆకు పాలను కంటి మీద రాసుకుంటే కంటికి ఉపశమనంగా పనిచేస్తుంది.