ఆటాపోటీ

రవి శాస్ర్తీ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి శాస్ర్తీ స్పిన్ మాయాజాలం ఏమిటో ఆస్ట్రేలియాకు బాగా అర్థమైన మ్యాచ్ 1991 డిసెంబర్ 8న పెర్త్‌లో జరిగింది. ఫాస్ట్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. అయితే, కృష్ణమాచారి శ్రీకాంత్ ఒంటరి పోరాటాన్ని కొనసాగించి 60 పరుగులు చేయడంతో, భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల స్కోరును సాధించగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను తొలుత జవగళ్ శ్రీనాథ్ దెబ్బతీశాడు. అతను రెండు వికెట్లు పడగొట్టగా, భారత్‌ను గెలిపించే బాధ్యతను రవి శాస్ర్తీ తీసుకున్నాడు. అతను 6.5 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 15 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. అతని స్పిన్ మాయాజాలంలో చిక్కుకొని విలవిల్లాడిన ఆస్ట్రేలియా 101 పరుగులకే కుప్పకూలింది. 107 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాలో ఆ జట్టుకు భారత్ చేతిలో ఇప్పటి వరకూ అదే అతి పెద్ద పరాజయం.