జాతీయ వార్తలు

జరిమానా కట్టను.. అభివృద్ధికి సహకరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ రవి శంకర్ ధిక్కార స్వరం

న్యూఢిల్లీ, మార్చి 12:యమునా తీరాన్ని పునరుద్ధరించడానికి, అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామే తప్ప తమపై విధించిన జరిమానాను కట్టే ప్రసక్తి లేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం కోసం యమునా తీరంలో కట్టడాలు నిర్మించినందుకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఐదు కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. రెండో రోజైన శనివారం ఈ సదస్సులో మాట్లాడిన రవిశంకర్ ‘ ఇంత మొత్తాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ మమ్మల్ని కట్టమన్నది యుమునా తీరం పునరుద్ధరణకే తప్ప జరిమానాగా కాదు’అని తెలిపారు. ‘నేను మచ్చలేని జీవితానే్న గడిపాను. స్కూలుకు ఎప్పుడూ ఆలస్యంగా వెళ్లలేదు. ఒక్క పైసా జరిమానా కట్టలేదు. ఇప్పుడు కట్టం కూడా’అని రవిశంకర్ తెగేసి చెప్పారు. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌పై విధించింది జరిమానా కాదని, పత్రికల్లో తప్పుగా ప్రచారమైందన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అభివృద్ధి కోసమే అయితే అందుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని వెల్లడించారు.