బిజినెస్

ప్రభుత్వ బ్యాంకులకు మా మిగులు నిధులివ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 22: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్‌బిఐ మిగులు నగదు నిల్వలను అందించాలన్న ప్రతిపాదనను గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యతిరేకించారు. నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వద్దనున్న మిగులు నగదును ఇవ్వాలంటూ వస్తున్న సూచనలను బుధవారం రాజన్ తోసిపుచ్చారు.
ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అర్వింద్ సుబ్రమణ్యన్ ఆర్థిక సర్వేలో చేసిన ఈ సూచనపై ఇక్కడ పారిశ్రామిక సంఘం అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజన్ స్పందిస్తూ ఇది పారదర్శకంగా ఉండదన్నారు. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిలు.. అధిక వడ్డీరేట్లతో పెరగడం లేదని, రుణాల వృద్ధి పతనం వల్లేనని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) రుణాల వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిందని తెలిపారు. దీంతో మొండి బకాయిలు పెద్దగా కనిపిస్తున్నాయని చెప్పారు.
పలు వివాదాస్పద పరిణామాల మధ్య రెండోసారి గవర్నర్ పదవిని చేపట్టలేనంటూ రాజన్ గత శనివారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రకటించినది తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 4న రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది.

అసోచామ్ కార్యక్రమంలో మైసూర్ తలపాగాతో రాజన్

‘పనామా’పై ప్రభుత్వానికి నివేదికలు
న్యూఢిల్లీ, జూన్ 22: సంచలనం సృష్టించిన పనామా పత్రాలపై విచారణ జరిపిన బహుళ దర్యాప్తు సంస్థల కమిటీ.. కేంద్ర ప్రభుత్వానికి మూడు నివేదికలను సమర్పించింది. దాదాపు 500 మంది భారతీయులు విదేశీ సంస్థల్లో తమ నల్లధనంతో అక్రమ పెట్టుబడులను పెట్టారని పనామా పత్రాల ద్వారా బహిర్గతమైనది తెలిసిందే. ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉండగా, అన్ని దేశాల్లోనూ పనామా పత్రాలు ప్రకంపనలు సృష్టించాయి. దీంతో సుప్రీం కోర్టు సూచనతో బహుళ దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి.

పెద్ద బ్యాంకుల కోసం..
న్యూఢిల్లీ, జూన్ 22: కేంద్ర ప్రభుత్వం పెద్ద బ్యాంకుల కోసం చూస్తోంది. దేశంలో ఇప్పుడున్న 27 ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి 4-5 పెద్ద బ్యాంకులుగా మార్చాలన్న మోదీ సర్కారు ఆలోచనగా కనిపిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలో దాని ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేయడంతో ప్రభుత్వ ఆలోచన అమల్లోకి వచ్చినట్లైందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిలకు అధిక బ్యాంకులే కారణమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందుకే బ్యాంకుల ఎకీకరణకు మోదీ ప్రభుత్వం ముందు నుంచి మద్దతు పలుకుతోంది.