జాతీయ వార్తలు

ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై : ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న ఎన్ఎస్ విశ్వనాథన్ ను కొత్త డిప్యూటీ గవర్నర్ గా నియమిస్తూ ప్రభుత్వ ప్యానల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న హెచ్ఆర్ ఖాన్ జూలై 3తో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియమకాన్ని చేపట్టింది. ఆర్బీఐ గవర్నర్ గా రెండోసారి కొనసాగలేనని రఘురాంరాజన్ స్పష్టంచేయడంతో ఆ పదవిలోకి ఎవరొస్తారన్న ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే అనేక పేర్లు వినిపించినప్పటికీ.. రాజన్ తర్వాత ఆర్ బీఐ గవర్నర్ స్థానంలో ఉండే అభ్యర్థుల జాబితాను నలుగురికి పరిమితం చేసింది.