జాతీయ వార్తలు

ఆర్‌బిఐ గవర్నర్‌గా అరుంధతికి అవకాశం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తదుపరి గవర్నర్‌గా ఎవరిని నియమించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం కొద్దిరోజుల్లోనే పూర్తవుతుంది. రెండోసారి ఆ బాధ్యతలను చేపట్టే ఆసక్తి తనకు లేదని రాజన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గవర్నర్ పదవిని భర్తీ చేసేందుకు కొన్ని పేర్లను కేంద్రం పరిశీలిస్తోంది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేరు ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. కేంద్రం రూపొందించిన జాబితాలో ఆమెతో పాటు ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ పేర్లు ఉన్నాయని సమాచారం. వీరిలో అరుంధతికే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటున్నారు.