జాతీయ వార్తలు

ఆర్‌బిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రైతులు, సామాన్య జనం రుణాలు బకాయిపడితే వారి ఆస్తులను జప్తు చేసే బ్యాంకులు వేలకోట్ల రూపాయల్లో బకాయిపడే వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రుణఎగవేతదారుల వివరాలు వెల్లడించలేమంటూ ఆర్‌బిఐ నిస్సహాయతను వ్యక్తం చేయడం సరైన విధానం కాదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 500 కోట్ల రూపాయలకు పైబడి బకాయి ఉన్న వారి వివరాలను గోప్యంగా ఉంచాలని ఇటీవల ఆర్‌బిఐ ఓ సీల్డుకవర్‌ను కోర్టుకు సమర్పించింది. సీల్డు కవర్‌లో ఉన్న వ్యక్తుల వివరాలు వెల్లడించాలని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది. రుణఎగవేతదారులకు సంబంధించి అన్ని వివరాలను సమర్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.