తెలంగాణ

బిసిలకోసం ప్రత్యేక పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 17: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బిసి సంఘం జాతీయ అధ్యక్షుఢు ఆర్.కృష్ణయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు పరోక్షంగా స్పష్టం చేసారు. రాజకీయంగా వెనకబాటుతనానికి గురవుతున్న బిసిల కోసం త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంటూ పార్టీని వీడబోతున్నట్లు సంకేతమిచ్చారు. బుధవారం సంగారెడ్డి ఐబిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తరహాలో బిసిల హక్కులను కాపాడుకునేందుకు జిల్లాల వారిగా బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో రెండు లక్షల మంది బిసిలతో సభలు నిర్వహించి బిసిల ఐక్యతను చాటుకుంటామన్నారు. చివరగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటులో బిసిలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఒకటి రెండు కులాలకు ఎదో చేసామని చెప్పుకోవడం సరికాదని, బిసి కులాలన్నింటికీ న్యాయం చేకూర్చడానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసారు. గొల్ల, కురమ, యాదవులకు గొర్రెల యూనిట్లను మంజూరు చేయడమే కాకుండా మత్స్యకారులను ప్రోత్సహించడం అభినందనీయమే అయినా అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించాల్సిన అవరసం ప్రభుత్వంపై ఉందన్నారు.