హైదరాబాద్

జిలెటిన్ స్టిక్స్ పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఇంటినిర్మాణంలో భాగంగా బండరాళ్లను తొలగించేందుకు భారీ స్థాయిలో పేల్చిన జిలిటెన్ స్టిక్స్ ప్రభావం వల్ల సమీపంలోని ఒక ఇల్లు కూలిపోయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పారిశ్రామిక వేత్తకు చెందిన స్ధలంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా అక్కడ ఉన్న బండరాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను వాడారు. దీంతో భారీ శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న నివాసితులు ఏదో జరిగిందనే భయంతో పరుగులు తీశారు. జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 48లో జరిగిన ఈ సంఘటన పట్ల పోలీసులు హుటాహుటిన తరలి వచ్చి విచారణ చేపట్టారు. పేలుళ్ల ధాటికి సమీపంలో ఉన్న ఇల్లు కూలిపోవడంతో కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. బాంబ్‌స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. పేలుళ్లకు అనుమతి ఉందా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నారు.