తెలంగాణ

కందుల కొనుగోలుపై కేంద్రం నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: కందుల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర మంత్రులు టి. హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బీఆర్‌కే భవన్‌లోని మార్కెటింగ్ కార్యాలయంలో మంగళవారం వారు కందుల కొనుగోళ్ల అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, కేంద్రం కేవలం 75 వేల టన్నుల కందులను మాత్రమే కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని, ఇది సరిపోదన్నారు. కనీసం 1.50 లక్షల టన్నుల కందులను కేంద్రం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర పౌరసరఫరాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌ను కోరినప్పటికీ, ఫలితం లేదన్నారు. ఈ పర్యాయం తెలంగాణలో కందుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఇదే అదనుగా వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లోని రైతుల నుండి తక్కువ ధరకు కందులు కొనుగోలు చేసి, తెలంగాణలోని మార్కెట్లలో ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని అధిగమించి ఇక్కడి రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. దళారుల నుండి రైతులను కాపాడేందుకు కేంద్రం ముందుకు రావాలన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు ఈ నెల 15 న తాము ఢిల్లీ వెళుతున్నామని ప్రకటించారు. ఇప్పటి వరకు రైతుల నుండి 1.70 లక్షల టన్నుల కందులు కొనుగోలు చేసినప్పటికీ, మరో 1.50 లక్షల టన్నుల కందులు రైతుల వద్ద ఉండిపోయాయన్నారు. దాంతో హాకా, మార్క్‌ఫెడ్‌లు రైతుల నుండి కందులు కొనుగోలు చేసేందుకు 600 కోట్ల రూపాయలను బ్యాంకుల నుండి ఈ సంస్థలకు రుణంగా ఇప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. కొంత మంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు కందులు కొనుగోలు చేసి తీసుకువచ్చి, తెలంగాణ మార్కెట్లలో రైతుల పేర్లతో విక్రయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే కొంత మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు.
ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రులు హరీష్‌రావు, పోచారం ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.