రంగారెడ్డి

బస్సుయాత్ర విజయ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఫిబ్రవరి 24: కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా చైతన్య బస్సుయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మాజీమంత్రి సబితారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా వద్ద సభాస్థలి ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కార్తీక్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, నాయకులతో కలిసి సబితారెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల నుంచి కాంగ్రెస్ చేపట్టిన యాత్రను ప్రజలందరూ ఆశీర్వదించి విజయవంతం చేయాలన్నారు. గతంలో 2003లో దివంగత వైఎస్‌ఆర్ చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టడంమే కాకుండా ప్రతి కార్యక్రమం చేవెళ్ల నుంచి మొదలు పెట్టారని చెప్పారు. 2014 ఎన్నికలను సైతం దేశ అధ్యక్షులు సోనియాగాంధీ బహిరంగ సభను చేవెళ్లలో నిర్వహించామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశం గుప్త, ఏ బ్లాక్ అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల పార్లమెంట్ యూత్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ గోపాల్ రెడ్డి, చేవెళ్ల యూత్ అధ్యక్షుడు టేకులపల్లి శ్రీనివాస్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి
వికారాబాద్, ఫిబ్రవరి 24: రాష్ట్రం లో టీఆర్‌ఎస్ పాలనకు రోజులు దగ్గ రపడ్డాయని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రజా చైతన్యయాత్ర సభను నిర్వహించే చిగుళ్లపల్లి మైదానాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి పరిశీలించారు. మల్లేష్ మా ట్లాడుతూ టీఆర్‌స్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సంక్షేమం వదిలి కమీషన్ల కోసమే పనులు చేపడుతున్నారని, కుటుంబ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని ధ్వజమెత్తారు. వీటన్నింటిపై ప్రజలను చైతన్యపర్చేందుకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 నియోజకవర్గాల్లో యాత్ర చేపడుతున్నారని చెప్పారు. చేవెళ్లలో ప్రారంభమయ్యే యాత్ర వికారాబాద్, తాండూర్‌ల మీదుగా సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వీ.సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ.సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎల్.శశాంక్ రెడ్డి, పటేల్ సంగమేశ్వర్, ఎర్రవల్లి సర్పంచ్ జాఫర్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రఘుపతి రెడ్డి, పట్టణ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ సీ.రామస్వామి, రెడ్యానాయక్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు అయూబ్ అన్సారి పాల్గొన్నారు.

మహిళలను చైతన్య పరిచేందుకు
ప్రత్యేక కార్యక్రమాలు
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 24: సమాజంలో మహిళల పాత్ర గణనీయంగా పెంచి, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎనిమిది రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి నీలిమ తెలిపారు. మండల పరిధి వెంకటాపూర్ లోని సీవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నట్టు పేర్కొన్నారు. 1909లో మహిళా దినోత్సవం ప్రారంభం అయినట్లు, వంద సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ నేటీకీ మహిళలు సాధించిన ప్రగతి, లక్ష్యాలు ఆశించినంత జరగలేదన్నారు. మహిళలను చైతన్యపరిచేందుకు 26న మహిళల ఆరోగ్యం, 27న వాణిజ్యశ్రీ, 28న సుభద్ర, మార్చి రెండున సృజనని, మూడున జ్ఞాన ధీర, అయిదున విజయ విలాసిని, ఆరున మహిళలకు పోటీలు, ఏడున మనస్విని వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డైరెక్టర్ కేఎస్‌రావు, హెచ్‌ఓడీలు వసుద భక్షి, విమ ల, ముకుందారాణి, సవిత, కృష్ణకుమారి, శ్రీదేవి, ప్రతిభ, స్వప్న, స్రవంతి పాల్గొన్నారు.
కాంగ్రెస్ బస్సు యాత్రకు వేలాదిగా తరలి రావాలి
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 24: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేపడుతున్న కాంగ్రెస్ బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోటకూర జంగయ్యయాదవ్ తెలిపారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతు ఈ నెల 26న చేవెళ్ల నుంచి చేపట్టనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర, బహిరంగ సభను రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా జరిగే భారి బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మందికి పైగా పాల్గొంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బస్సు యాత్ర సందర్భంగా ఎండగట్టనున్నట్లు పేర్కొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, మాజీ సర్పంచ్‌లు వవ్వల్‌దాసు సంజయ్‌కుమార్, డక్కి రమేశ్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యంపాల సుధాకర్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం సోషల్ మీడీయ సమన్వయకర్త మహమ్మద్ అబ్ధుల్ ఖయ్యూమ్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సగ్గు
రెండో రోజు కొనసాగిన క్రీడా పోటీలు
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 24: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలోని మహవీర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో రాష్ట్ర స్థాయి క్రీడపోటీలు రెండవ రోజు కొనసాగాయి. వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన క్రీడాకారులకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, టేబుల్ టెన్నీస్ పోటీలు జరిగాయి. ఈ క్రీడాపోటీల్లో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. క్రీడాపోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు అనేక అవకాశాలను కల్పిస్తుందని, వాటిని వినియోగించుకొని మన దేశం పేరును నిలబెట్టాలన్నారు. శనివారం ముగింపు కార్యక్రమం కావడంతో గెలుపొందిన వారికి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మెన్ ఎస్.సుదర్శన్‌రెడ్డి, కార్యదర్శి ఎస్.సురేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్‌ఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి పాల్గొన్నారు.