రంగారెడ్డి

మహిళా ఎంపీపీ అయినందుకే వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, మార్చి 17: రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేస్తు మహిళననే చిన్న చూపు చూస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వివక్షత చూపిస్తూ అవమాన పరుస్తున్నారని ఆమనగల్లు ఎంపీపీ తల్లోజి లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాల్‌లో లలితమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సభ ప్రారంభంలోనే వ్యవసాయ శాఖ, అంగన్‌వాడీ ఎజెండాలపై సమీక్ష నిర్వహిస్తుండగా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, యువజన కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఆమనగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత భవనాన్ని కూల్చి వేసి నూతన భవనం నిర్మించాలని మండల సభలో తీర్మానం చేయాలని వినతిపత్రం అందించారు. ఎంపీటీసీలు పత్యానాయక్, గుప్పెని శ్రీనివాస్, జడ్పీటీసీ కండె హరిప్రసాద్ కలగజేసుకొని ఎంపీపీ అనుమతి లేకుండా మండల సభలోకి రావద్దని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సూచించారు. ఎంపీపీ లలితమ్మ మాట్లాడుతూ బీసీ మహిళనని చూడకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవమానపర్చడం బాధకరమని చెప్పారు. శుక్రవారం ఆమనగల్లులో సీసీ రోడ్డు నిర్మాణ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా ఎమ్మెల్సీ అవమానపరిచారని, అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్దండించారు. సమావేశంలో అధికారులు రవికుమార్, హరిబాబు, రమేష్ గౌడ్, వెంకట రాములు, వైస్ ఎంపీపీ నిట్ట నారయ్య, ఎంపీటీసీలు ఝూన్సి శేఖర్, యాదయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, యాదమ్మ, సర్పంచ్ నర్సింహా పాల్గొన్నారు.

ఎంపీపీ కార్యాలయం ఎదుట ధర్నా
మండల పరిషత్ అధీనంలో ఉన్న బస్టాండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతభవానాన్ని కూల్చి వేసి నూతన భవన నిర్మాణానికి మండల సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీపీ కార్యాలయం ముందు యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వాహించారు. కృష్ణ నాయక్, మహేష్ మాట్లాడుతూ ఇటీవల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పైకప్పు పెచ్చులు ఉడి పడి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారని గుర్తుచేశారు. నూతన భవనన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో ఎంపీడీవో వెంకట రాములు మాట్లాడి శాంతింపజేశారు.

బడ్జెట్‌లో గ్రేటర్‌కు మొండి చెయ్యి
వనస్థలిపురం, మార్చి 17: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గ్రేటర్ హైదరాబాద్‌కు మొండి చేయి చూపించి, ప్రభుత్వం గ్రేటర్ ఖజానాను గుల్ల చేస్తుందని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. శనివారం వనస్థలిపురం చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ.. కోట్లరూపాయల గ్రేటర్ రాబాడిని రవాణ సంస్థకు దారదత్తం చేసి నగర అభివృద్ధిని కుంటూ పడేవిధంగా సీఎం కేసీఆర్ చేస్తున్నారని గుర్తు చేశారు. గ్రేటర్ ప్రజల వద్ద కోట్లాది రూపాయలు పన్నులను వసూళ్లు చేసి టీఎస్ ఆర్టీసీకీ మళ్లిస్తూ నగర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నగరాన్ని విశ్వనగరంగా మా రుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం, మంత్రులకు తవ్విన గుంతలు పాడైన రహదారులు కళ్లకు కన్పించడం లేదా అనీ రంగారెడ్డి ప్రశ్నించారు. సీఎం, గ్రేటర్ ఎన్నికలలో ఆచరణలో సాధ్యం కానీ హామీలను ఇచ్చి అధికా రంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఒక్క సమస్యను పరిష్కరించలేదని చెప్పారు. ఎల్బీనగర్ తోపాటు గ్రేటర్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి, నూతి శ్రీనివాస్ రావు, తూర్పాటి కృష్ణ, మురళీధర్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, యంజాల జగన్, చెక్క అశోక్, నాంపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.