రంగారెడ్డి

కనె్నర్రజేసిన రెవెన్యూ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 17: మేడిపల్లి మండలం పరిధిలోని చెరువుల వద్ద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కనె్నర్ర చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలను సహించమంటూ పీర్జాదిగూడ భవానీనగర్‌లో నిరుపేద నిర్మించుకుంటున్న ఇంటిని కూల్చివేశారు. కష్టం చేసి సంపాదించుకున్న డబ్బుతో స్థలం కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించుకుంటున్న గొల్ల ఐలయ్య తన మూగ కుమారుడితో కలిసి బయటకు వెళ్లగా ఆర్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది లక్షల రూపాయల విలువైన ఇంటిని నేలమట్టం చేశారు. చెరువు పక్కన ఎఫ్‌టీఎల్‌లో ఉండటమే కూల్చివేతకు కారణమని చెప్పారు. ఇదే చెరువులోని ఎఫ్‌టీఎల్ పరిధిలో యథేచ్ఛగా జరుగుతున్న ఇంటి నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో రాత్రికి రాత్రే లారీలలో మట్టిని పోయించి ప్లాట్లుగా మారుస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ ఏ ఆధారం లేని నిరుపేదలపై ప్రభావం చూపించడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలం పరిధిలోని చెంగిచర్ల చెరువు ఎఫ్‌టీఎల్‌లో రాజకీయ పలుకుబడి కల్గిన వ్యక్తుల అండదండలతో యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి.
పక్క సర్వే నెంబర్‌పై కోర్టు నుంచి ఇంటర్‌ఫీయిర్ కావద్దని తెచ్చి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినా కోర్టు ఆర్డర్ ఉందని వౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీర్జాదిగూడ, బోడుప్పల్, పర్వతాపూర్ చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో మూసీ కాలువ బఫర్ జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా వాటిపై కనె్నత్తి చూడని అధికారులు, సిబ్బంది.. నిరుపేద ఇంటిని కూల్చివేయడమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఏయూకే క్రికెట్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టీఏయూకే) ఆధ్వర్యంలో టీ-20 క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. టోర్నీ మే నుంచి ఆగస్టు వరకు ఇంగ్లాండ్‌లో జరుగుతుంది. ఈ లీగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 20 జట్లు పా ల్గొంటున్న టోర్నమెంటుకు సంబంధించిన పోస్టర్‌ను శాట్స్ చైర్మన్ ఆల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. యునైటెడ్ కింగ్‌డామ్‌లో ఉన్న తెలంగాణ , ఏపీ జట్ల సభ్యులు టోర్నమెంట్ లో పాల్గొంటారు. లాల్‌బహదూర్‌స్టేడి యం శాట్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ్, సినిమా హిరో లోహిత్, సిని సంగీత దర్శకుడు శేషి ప్రతం, టో ర్నమెంట్ నిర్వాహకులు రాకేష్ పటేల్, సురేష్, రత్నాకర్, అశోక్, మల్లారెడ్డి, నవీన్ రెడ్డి, టోర్నమెంట్ ఫౌండర్ అనిల్ కుర్మ చలం పాల్గొన్నారు.

కబడ్డీ టోర్నీ చాంప్ బెంగళూరు
హైదరాబాద్, మార్చి 17: ఆలిండియా ఎస్‌బీఐ ఇంటర్ సర్కిల్ కబడ్డీ టోర్నమెంట్ ట్రోఫీని బెంగళూరు జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో బెంగళూరు 46-20 పాయింట్ల తేడాతో పోటీలకు అతిథ్యమిస్తున్న హైదరాబాద్‌పై విజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో శనివారం మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టులో సురేష్ కుమార్, జీ.రాజు, హైదరాబాద్‌లో ఎం.నర్సింగ్ రావు, సునిల్ కుమార్, సాగర్ యాదవ్ అద్భుతమైన ఆట తీరును ప్రధర్శించారు. ఈ టోర్నమెంట్‌లో లీగ్ దశ ముగిసే సరికి 2 పూల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ముంబయి జట్లు సెమీస్‌కు అర్హత పొందాయి. సెమీస్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో బెంగళూరు 71-24 పాయింట్ల తేడాతో జైపూర్‌పై, హైదరాబాద్ 31-5తో ముం బయిపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ముంబయి 31-24 తేడాతో జైపూర్‌పై నెగ్గింది. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ స్వామినాథన్ విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందజేశారు.