రంగారెడ్డి

సంప్రదాయబద్ధంగా ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 18: తెలుగు పండుగల్లో ఉగాదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మల్కాజ్‌గిరి భాగ్ బౌధిక్ ప్రముఖ్ పతంగి బాలమురళీకృష్ణ పేర్కొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఆదివారం కీసరలోని లలిత ఫంక్షన్ హాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్యర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి బాలమురళీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేటి యువత ఇంగ్లీషు పండుగలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుగు పండుగలకు ఇవ్వకపోవటం విచారకరమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు పండుగల ప్రాధాన్యత, వాటి విశిష్టత గురించి, తెలియ జేయాలని సూచించారు. కొన్ని మతాలు హిందుత్వాన్ని నాశనం చేయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయని, హిందువులు అలాంటి వారిని దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. చిన్నారుల సాస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వెంపటి సాయికిరణ్ శర్మ పంచాంగశ్రవణం చదివి వినిపించారు. కార్యక్రమంలో ఐజీ గోశాల నిర్వహకులు భవర్‌లాల్, మల్గాజ్‌గిరి భాగ్ కార్యావహ ఏలూరి భాస్కర్, కీసర ఖండ కార్యావహ ఆరేపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
వికారాబాద్: జిల్లాలో ఆదివారం ఉగాది పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. వేప పువ్వు, మామిడి, బెల్లం, కొత్త చింతపండు, పుట్నాలు, కొబ్బరి కలిపి చేసిన పచ్చడిని ఆరగించడంతోపాటు ఇరుగుపొరుగు, బంధువులకు పంచారు. సమీపంలోని అనంతగిరి శ్రీఅనంత పద్మనాభస్వామి, బుగ్గ శ్రీరామంలిగేశ్వర స్వామి, బండబావి శ్రీఆంజనేయస్వామి ఆలయాల్లో భగవంతుడిని దర్శించుకున్నారు.
నూతన వాహనాలు తీసుకున్నవారు, కొత్త వ్యాపారం, పనులు ప్రారంభించేవారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్థానిక శ్రీమల్లికార్జున భవనం, శ్రీరామ మందిరం, పాతగంజ్ శ్రీఆంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరశైవ సమాజం/యువజన సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహం వద్ద నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని శాసనసభ్యుడు బీ.సంజీవ రావు ప్రారంభించగా, మున్సిపల్ చైర్మన్ వీ.సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రా రెడ్డి, టీఎర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎన్.శుభప్రద్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్, వీరశైవ సమాజం నాయకులు పటేల్ సంగమేశ్వర్, ఆత్మలింగం పాల్గొన్నారు. అనంతగిరి శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయం ఆవరణలో వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పచ్చడి వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వీ.సత్యనారాయణ ప్రారంభించగా సంఘం కార్యదర్శి అల్లెంకల వెంకటేశం, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాలె లక్ష్మణ్, వికారాబాద్ అధ్యక్షుడు దోమ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి బుస్స శ్రీకాంత్ పాల్గొన్నారు.
తాండూరు: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం తాండూరు డివిజన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. షడ్రుచుల పచ్చడిని ఇంటింటా చేసుకొని కుటుంబీకులతో పాటు, స్నేహితులు, చుట్టుపక్కల వారికి ఉగాది పచ్చడిని పంచి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగు నూతన సంవత్సర వేళ పట్టణంలోని అన్ని దేవాలయాలలో భక్తుల సందడి కినిపించింది. ఉగాదిని పురస్కరించుకొని భక్తులు, మహిళలు ఆలయాలకు పోటెత్తారు. వైష్ణవ, శైవాలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. ఉదయం వేళ శుభ స్నానాలు ఆచరించి తమ తమ ఇళ్లల్లో దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ భావిగి భధ్రేశ్వర స్వామి
రథచక్రాల స్థాపన మహోత్సవం
తాండూరు పట్టణంలో ప్రతి ఏడాది నిర్వహించే స్థానిక శ్రీ్భవిగి భధ్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టంగా నిలిచే స్వామివారి రథోత్సవానికి చెందిన రథ ఛక్రాలను ఆలయ పరిసరాలలో ఉగాది పర్వదినం రోజున నిలపటం ఆనావాయితీగా వస్తుంది. ఉగాది పర్వదినం ఆదివారం సాయంత్రం శ్రీ్భవిగి భద్రేశ్వర స్వామి రథ చక్రాలను ఆలయ పరిసరాలలో ఉన్న భధ్రేశ్వర చౌరాస్తాలో నిలిపారు వేద మంత్రోచ్ఛరణల నడుమ వేద పండితుల ప్రత్యేక పూజా కార్యక్రమాల నడుమ స్వామివారి రథ చక్రాలు ప్రతిష్టించారు.