హైదరాబాద్

పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 18: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మహిళా పతంజలి యోగసమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మమ్మ స్మారక విద్యాలయంలో షడ్రుచుల ఉగాది పచ్చడితో పూజలు నిర్వహించి అనంతరం మహిళలకు లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, స్పీడ్, వాకింగ్, సూది దారం తదితర ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలకు పెద్ద ఎత్తున యోగ నేర్పించేందుకు సంకల్పం చేశారు. పోటీల్లో గెలుపొందిన వారికి యోగ డే రోజున బహుమతులు ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో పతంజలి యోగ సమితి రాష్ట్ర యువసహ ప్రభారి కిషోర్, మండల అధ్యక్షుడు నాగభూషణం, మహిళా సమితి జిల్లా అధ్యక్షురాలు ప్రవీణ కిషోర్, మండల అధ్యక్షురాలు పుషాప్పలత మల్లారెడ్డి, సభ్యులు నరేందర్ రెడ్డి, మురళి, కవిరాజ్, వెంకటరమణ, వేణుగోపాల్, ఆంజనేయులు, పద్మమ్మ, వనజ, హేమలత, శివ, మాధవి, శాంత, బాలమణి, ప్రణయ, హేమలతా రెడ్డి, అపర్ణ పాల్గొన్నారు.

ఉపాధి చూపుతున్న చెరుకు బండ్లు
ఇబ్రహీంపట్నం, మార్చి 18: నియోజకవర్గ పరిధిలో కరువు పరిస్థితులు విలయతాండవం చేస్తూ వ్యవసాయ రంగం పూర్తిగా అడుగంటిపోతోంది. దీంతో రైతులతో పాటు వ్యవసాయ కూలీలు సైతం ఉపాధిని కోల్పోతున్నారు. వీరికి చెరుకుబండ్లు ఉపాధిని చూపుతున్నాయి. సాగర్ రహదారి వెంట చెరుకు రసం బండ్లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. ఒకేసారి పెట్టుబడి పెట్టి, కేవలం చెరుకుగడలను అవసరానుగుణంగా కొనుగోలు చేస్తే సరిపోతుందనే ఉద్ధేశ్యంతో ఎంతో మంది చెరుకు రసం బండ్లను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి విస్తరించి ఉన్న సాగర్ రోడ్డు ప్రక్కన పదుల సంఖ్యలో చెరుకు రసం బండ్లను ఏర్పాటు చేశారు.
వేసవిని దృష్టిలో పెట్టుకొని రహదారి మీదుగా ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు చల్లటి తాజా చెరుకురసాన్ని అందిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. గతంలో కొన్ని మాత్రమే దర్శనమిచ్చే చెరుకు రసం బండ్ల సంఖ్య నేడు భారీగా ఉన్నాయి. గ్లాసు ధరను రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో చెరుకు గడల వ్యాపారులకు సైతం కాసులు కురుస్తున్నాయి. కళ్ల ముందే రసాన్ని తీసి ఇస్తుండడంతో ప్రజలు సైతం వీటిని అధికంగా ఆశ్రయిస్తున్నారు. భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్న ప్రజలు చెరుకురసాన్ని సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. చెరుకు రసం బండ్లు ఏర్పాటు చేసుకున్న వారికి ఆదాయం మెరుగ్గా ఉంటోంది. కరువు పరిస్థితులు, నిర్మాణ రంగంలో ఉపాధి తగ్గిపోతుండడంతో మంచి ఆదాయ వనరుగా ఉన్న చెరుకు రసం బండ్ల నిర్వాహకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రయాణికుల దాహర్తిని తీర్చడంతో పాటు చెరుకు రసం వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. దీంతో పాటు కూలీలకు ఆదాయ వనరుగా పనిచేస్తూ వారి జీవితాల్లోనూ వెలుగులు నింపుతోంది.