రంగారెడ్డి

టీడీపీ పటిష్టతకు సైనికుల్లా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 18: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యుడు టీ.దేవేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం దేవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కందికంటి అశోక్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ సర్కిల్ నాయకులు పబ్బతి శేఖర్ రెడ్డి, కోల రవికుమార్, డాక్టర్ అశోక్, ఇమాం, గోపాల్ రెడ్డి, చోటేమియా, స్వామి, మధుసూదన్, వౌలాలి వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి దేవేందర్ గౌడ్‌తో ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీని పటిష్ఠం చేయాలని, రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

దేవేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
తెలిపిన ఘట్‌కేసర్ మండల నాయకులు
ఘట్‌కేసర్: ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి నాయకుడు నిరంతరం కృషి చేసి ప్రజల మన్నలను పొందాలని ఎంపీ తుళ్ల దేవేందర్ గౌడ్ అన్నారు. రాజ్యసభ సభ్యుడు, మాజీ హోంమంత్రి టీ.దేవేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఘట్‌కేసర్ మండల టీడీపీ నాయకులు ఆదివారం నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రఘుపతిగౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు నానావత్ రూప్‌సింగ్‌నాయక్, మండల శాఖ అధ్యక్షుడు మేడబోయిన వెంకటేశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి వేముల సంజీవ గౌడ్, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.
వికారాబాద్, మార్చి 18: గ్రామాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రారభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని కల్పించడంలో వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 11982 కుటుంబాలకు వంద రోజుల పనిని గ్రామీణాభివృద్ధి సంస్థ కల్పించి ఆందుకుంది. సగటున ఒక మనిషికి 57.49 పనిదినాలను కల్పించడంతో గ్రామీణ కూలీలకు ఉపాధి లభించింది. జిల్లాలో 3931 ఫాం పాండ్స్ ఏర్పాటు చేయడంతో జిల్లా తెలంగాణలో రెండో స్థానంలో నిలిచింది. 1698 నాడెం కంపోస్ట్‌లను ఏర్పాటు చేయడంతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 38 మేకల పాకల ఏర్పాటు, 109 పశువుల పాకలను ఏర్పాటు చేయడంతో జిల్లా ప్రథమ స్థానానికి చేరుకుంది. 9963 వర్క్‌సైట్ బోర్డుల ఏర్పాటు, 197 గ్రామాల సమాచార బోర్డుల ఏర్పాటులోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 9979 వర్క్‌ఫైల్స్‌తో ప్రథమ స్థా నంలో వికారాబాద్ జిల్లా నిలిచింది.
జిల్లాకు ప్రత్యేక స్థానం..
డీఆర్‌డీవో జాన్సన్ చొరవే
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వికారాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం రావడానికి కారణం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి పీడబ్ల్యూ జాన్సన్ చొరవే. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఇటు ఉపాధి హామీ సిబ్బందికి అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించి, మార్గదర్శనం చేస్తూ వచ్చారు. పనితీరును గుర్తించి ఇటీవలే వచ్చిన కేంద్ర బృందంతో పాటు, రాష్ట్ర, జిల్లా అధికారుల నుండి ప్రశంసా పత్రాలు, మన్ననలు పొందారు.