రంగారెడ్డి

విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 19: ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ ఎంతో అవ సరమని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ అన్నారు. పాఠశాలను స్థాపించిన రెండు సంవత్సరాల్లోనే విద్యాపరంగా విద్యార్థులకు న్యాయం చేయడంలో రామకృష్ణ విద్యాలయం ముందుందని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. సోమవారం మధుబన్‌కాలనీలో శ్రీరామకృష్ణ విద్యాలయంలో నిర్వహించిన ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఐపీఎస్ అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను తమ కంటే బాగుగా చదివించి, ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. ఐపీఎస్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ పాఠశాల సిలబస్‌లో శ్రీస్వామి వివేకానంద మార్గదర్శక పాఠాలను ప్రత్యేకంగా చేర్చినందుకు యాజమాన్యాన్ని కొనియాడారు. పాఠశాల కరస్పాండెంట్ బొల్ల శ్రీనివాస్, డైరెక్టర్ బొల్ల రాజేశ్వరి, బొల్ల నరేందర్, ఎం.జీవనమూర్తి, ప్రిన్సిపల్ సునీల్‌కుమార్, గ్రామ పెద్దలు మస్న వెంకటేష్, కాశీగారి యాదగిరి, సిహెచ్ నర్సింహ పాల్గొన్నారు.

చారిత్రక కట్టడాలు ధ్వంసం చేస్తే సహించం
షాద్‌నగర్, మార్చి 19: చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తే సహించేది లేదని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం షాద్‌నగర్‌లో నర్సింలు మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తున్నవారిపై స్థానిక పురపాలక సంఘం అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 2012, 2017లో కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. పురాతన కట్టడాలను పరిరక్షించే బాధ్యత అధికారులపై ఉందని, వాటిని ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. సమావేశంలో ఫరూఖ్‌నగర్ మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు
మేడ్చల్, మార్చి 19: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు అత్యధికంగా పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ మల్లారెడ్డి వివాహ వార్షికోత్సవం సోమవారం నగరంలోని బోయిన్‌పల్లి ప్రాంతంలోని తన నివాసంలో ఘనంగా జరిగింది. మేడ్చల్‌కు చెందిన పలువురు టీఆర్‌ఎస్ నాయకులు తెల్లవారుఝామున ఎంపీ నివాసానికి తరలివెళ్లి ఎంపీ దంపతులిద్దరికీ పూలమాలలు వేసి కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కండ్లకోయ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్, వీర్లపల్లి భాగ్యరెడ్డి, మర్రి నర్సింహా రెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.