రంగారెడ్డి

రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 19: రాబోవు 2019 ఎన్నికలకు టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పార్టీనేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సయ్యద్ రషీద్ ఆధ్వర్యంలో మగ్దూమ్‌నగర్‌లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పెద్దిరెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా 500 మంది కార్యకర్తలతో సైకిల్ యాత్ర నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో 40 ఏళ్లు రాష్ట్రం వెనక్కి పోయిందని ఎద్దేవా చేశారు. పథకాల పేరిట కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని, నిధులన్ని జేబుల్లోకి తప్ప ప్రజలకు చేరడం లేవని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మోసాలు చేయడంలో దిట్ట అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని భూస్థాపితం చేయడానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ మాజీమంత్రి దేవేందర్ గౌడ్ చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచిపోలేరని, మురికివాడలను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే అని గుర్తుచేశారు. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ రషీద్ మాట్లాడుతూ జగద్గిరిగుట్ట డివిజన్‌తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి హన్మంతరావు, నేతలు రషీద్‌బేగ్, మా ర్తాకృష్ణ, యాదవరెడ్డి, ద్రుబాస్, వీరబాబు, రాజేశ్, పాలకృష్ణ, పద్మారావు, తులసి, సాజిత్ ఖాన్, ఉమామహేశ్వర రావు, రాజశేఖర్, సాయిరామ్, సునీత, హన్మంతు, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

‘రైట్ టూ యాక్ట్’ బిల్లు పెట్టాలి
ఖైరతాబాద్, మార్చి 19: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పౌరహక్కుల చట్టం ( రైట్ టూ యాక్ట్) అమలుచేసి, బిల్లు ఆమోదించాలని లోక్‌సత్తా డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో లోక్‌సత్తా తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు, ప్రధాన కార్యదర్శి రేఖ, యువ అధ్యక్షుడు శివరామకృష్ణ మాట్లాడుతూ.. పౌరులు తమ హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నారని, ప్రభుత్వం ప్రజలపట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగపడే మీసేవ, ఈసేవను మెరుగుపరచాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఒరిజనల్ పత్రాలతో భూమి కలిగి ఉన్నప్పటికీ కబ్జాలకు గురౌతుందని, దళారులు పెరిగిపోయారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో బాధ్యత పెరగాలని, అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఇప్పుడున్న చట్టాల గురించి నోరు విప్పాలని కోరారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖలో, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలలో, 108 సర్వీసుల్లో కూడా అవినీతి జరుగుతుందని తెలిపారు. సరోజాదేవి, కోదండరెడ్డి, నాగేశ్వరరావు, ఆనంద్ పాల్గొన్నారు.