రంగారెడ్డి

వడ్డీ మాఫీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే ఆస్తిపన్ను చెల్లించాలి
జనార్దన్ రెడ్డి సూచన
హైదరాబాద్, మార్చి 20: మహానగరవాసులకు ఎమర్జెన్సీ సేవలను అందించే జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నుకు ఈసారి వడ్డీ మాఫీ ఉత్తర్వులు ఉండవని కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సంవత్సరం టార్గెట్‌గా పెట్టుకున్న రూ. 1400 కోట్ల కలెక్షన్‌లో మంగళవారం నాటికి రూ. 1080 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు ఆయన తెలిపారు. గతంలో ప్రతి ఆర్థిక సంతవ్సరం చివరి నెల ఆఖరు వారంలో చెల్లించాల్సిన మొత్తం ఆస్తిపన్ను వడ్డీని మాఫీ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసేదని, ఈ సంవత్సరం అలాంటి అవకాశాలేమీ లేనట్టు ఆయన వివరించారు. ప్రజలు ఇది గమనించిన వెంటనే తమ ఆస్తిపన్ను బకాయిలను సమీపంలోని సిటిజన్ సర్వీసు కేంద్రాలు, మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో, ఎంపిక చేసిన బ్యాంకుల బ్రాంచిల్లో చెల్లించాలని సూచించారు. అంతేగాక, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్‌లో జరిపే చెల్లింపులకు కూడా ట్రాన్సాక్షన్ ఛార్జీలు మినహాయించినట్లు ఆయన వెల్లడించారు. చెక్కుల ద్వారా ఆస్తిపన్ను చెల్లించేవారి చెక్కులు బౌన్స్ అయితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన సూచించారు. టార్గెట్‌కు తగిన విధంగా ఆస్తిపన్ను వసూలు చేసుకునేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని, డీసీలు, వ్యాల్యుయేషన్ ఆఫీసర్లు, జోనల్ కమిషనర్లు కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇదిలా ఉండగా, సొంతిల్లు లేని నగరంలోని పేదల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు కూడా వచ్చే మార్చి మాసం కల్లా వంద శాతం పూర్తవుతాయని పేర్కొన్నారు. నగరంలో వౌలిక వసతులను కల్పించేందుకు, ఉన్న వాటిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఆరు ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ గణనీయంగా పురోగతిలో ఉన్నట్లు వివరించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు
హైదరాబాద్, మార్చి 20: ఫేస్‌బుక్‌లో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలతో పోస్ట్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమతా గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 19న రాజాసింగ్ ఫేస్‌బుక్‌లో చిన్నరాష్ట్రాలను వ్యతిరేకించిన మమత బెనర్జీతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా కలుస్తారంటూ కేసీఆర్ పై పోస్టు చేశారు. అనుచితంగా పోస్టింగ్‌లు పెట్టిన రాజాసింగ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మమతా గుప్తా నుంచి ఫిర్యాదు స్వీకరించినట్టు సైఫాబాద్ ఇన్స్‌పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.