రంగారెడ్డి

గొలుసు నాలా కబ్జాపై నామమాత్రపు చర్యలేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 22: గాజులరామారంలోని గొలుసు నాలా కబ్జా పై అధికార యంత్రాంగం నామ మాత్రపు చర్యలను చేపట్టి చేతులు దులుపుకున్నారు. అతి పెద్ద నాలా అయినా గొలుసు కట్టు నాలా ప్రైవేటు వెంచర్ మాయం చేసినా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. రాష్ట్ర మంత్రి అధికారులకు మొట్టికాయలు వేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 5న ‘ఆంధ్రభూమి’లో ‘గొలుసు నాలాను మింగేశారు’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి రాష్ట్ర మంత్రి స్పందించి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సంబంధిత అధికారులు నాలా కబ్జాను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులను దులుపుకున్నారు. మళ్లీ మొదటికి వచ్చిందనే ఆరోపణలు స్థానికంగా నెలకొన్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం సర్కిల్ సూరారం శ్రీరామ్‌నగర్‌లోని పెద్దచెరువు నుంచి గాజులరామారంలో వెలసిన బాలాజి లే అవుట్ వెంచర్ మీదుగా చిత్తారమ్మ దేవాలయం నుంచి గొలుసు నాలా పరికి చెరువు వరకు ప్రవహిస్తుంది. సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఉన్న నాలా పూర్తిగా కనుమరుగైంది. సర్వేనంబరు 92, 93, 98, 99, 101, 105, 106, 121, 122, 137, 136, 132, 130, 147, 175, 181, 183, 184 పైనుంచి 1200 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో గొలుసు నాలా ప్రవహిస్తుంది. రెండు కిలోమీటర్ల పొడవునా దాదాపుగా 2.5 ఎకరాల నాలా స్థలం ప్రైవేటు వ్యక్తుల వశమైన విషయం తెలిసిందే. నాలాను ప్రైవేటు వెంచర్ యాజమాన్యం తనకు అనుకూలంగా మలుచుకుని యథేశ్చగా నాలాను కబ్జా చేసి పైపులను వేసి నాలాను పూర్తిగా కనుమరుగు చేశారు. అంతేకాకుండా నాలాపై రోడ్లను, ప్లాట్లను సైతం వేసినట్లు అధికారుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. రానున్న వర్షాకాలానికి గొలుసు నాలాను పునరుద్ధరిస్తే ఎలాంటి ప్రమాదం జరగదని ప్రజలు భావిస్తున్నారు. గత వర్షాకాలంలోనే ఈ నాలా కబ్జాకు గురి కావడం వలన వరద నీరు పూర్తిగా వెంచర్‌లోనే నిలిచి చెరువును తలపించిన విషయం తెలిసిందే. రాబోవు వర్షాకాలానికి నాలాను పునరుద్ధరించని పక్షంలో ప్రమాదం తప్పదని ప్రజలు భయపడుతున్నారు. అతిపెద్ద గొలుసు నాలాను సుమారు 90 డిగ్రీల వరకు ఇష్టానుసారంగా మలుపుకున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం అతి పురాతనమైన, అతి పెద్ద గొలుసు నాలాను పునరుద్ధరించి కబ్జాదారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

దివ్యాంగుడి భూమి కాపాడాలి
* షాద్‌నగర్ ఆర్‌డీవోకు వినతిపత్రం
షాద్‌నగర్, మార్చి 22: దివ్యాంగుడి భూమిని కాపాడేందుకు రెవెన్యూ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. గురువారం నందిగామ మండలం గుడిమామిడిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు కావలి చంద్రయ్య, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ ఆర్డీవో ఎం.కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ మాట్లాడుతూ నందిగామ మండలం గుడి మామిడిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు కావలి చంద్రయ్యకు సంబంధించి వ్యవసాయ భూమిని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఖాతా తెరుస్తామని మాయమాటలు చెప్పి 37గుంటల వ్యవసాయ భూమిని బుద్దాం జానకి సాయిరామ్‌కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. భూమిని దివ్యాంగుడైన కావలి చంద్రయ్యకు ఇప్పించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుగా రూ.10వేలు ఇచ్చి అక్రమంగా సంతకాలు చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వాపోయారు. వినతిపత్రం ఇచ్చినవారిలో జీ.అశోక్, నర్సింహా చారి, బీసాయిబాబా, కే.నందం, కే.సత్తమ్మ, సుజాత ఉన్నారు.