రంగారెడ్డి

శ్రీ రామనవమికి ఆలయాలు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మార్చి, 24 సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. జానకి, కోదండరాముడి వివాహాన్ని కనువిందుగా వీక్షించేందుకు అమ్మపల్లి దేవాలయంలో అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. భభ్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు, తాగునీరు, అన్నదానం ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని నర్కూడ గ్రామ సమీపంలోని అమ్మపల్లి దేవాలయంలో సోమవారం జరిగే శ్రీ రామచంద్ర స్వామి కల్యాణ బ్రహ్మోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ రామనవమి పురస్కరించుకుని అమ్మపల్లి రాములవారి ఆలయంలో సోమవారం జరిగే మధ్యాహ్నం నిర్వహించనున్న కల్యాణాన్ని తిలకించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ విజయలక్ష్మీ సిద్ధులు, ఎంపీటీసీ సభ్యురాలు లత శ్రీనివాస్, కుమార్ యాదవ్, బూర్కుంట గోపాల్, టీ.కుమార్ గౌడ్, అశోక్ ముదిరాజ్ శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

తాండూరు: శ్రీరామ నవమి పర్వ దినం పురస్కరించుకొని తాండూరు పట్టణ డివిజన్‌లో శ్రీరామాంజనేయ దే వాలయాలు ముస్తాబవుతున్నాయి. సీతా రాముల కళ్యాణ మహోత్సవానికి వైష్ణవ ఆలయాలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ప్రసిద్ధ రైల్వేస్టేషన్ శ్రీరామాంజనేయ దేవాలయం, ఇందిరానగర్ శ్రీరామ మందిరం, దస్తగిరి పేట, పాత తాండూరు శ్రీవేంకటేశ్వరాలయాలు, స్థానిక శ్రీరామ రాఘవేంద్ర స్వామి దేవాలయంలతో పాటు, డివిజన్‌లోని యాలాల మండలంలో ఉన్న సుప్రసిద్ధ జుంటుపల్లి శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి పర్వదినం శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఏడాది మాదిరి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం నవమి ఉన్నందున పక్కనే ఉన్న కర్నాటకలో ఆదివారం శ్రీసీతా రాముల వారి కల్యాణ వేడుకలు నిర్వహిస్తుండగా, తాండూరు డివిజన్‌లో మా త్రం శ్రీ రాముల వారి జన్మ నక్షత్రం పురస్కరించుకొని రాష్ట్రంలోని భద్రాది వంటి ముఖ్య ఆలయాలలో మాదిరి శ్రీరామ నవమి, శ్రీసీతా రాముల కల్యాణ వేడుకలను సోమవారం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు పేర్కొంటున్నారు. పట్టణంలోని ప్రముఖ శ్రీరామాంజనేయ దేవాలయాలతో పాటు, అనాధి కాలంగా ప్రా ముఖ్యతను సంతరించుకున్న యాలాల మండలం జుంటుపల్లి శ్రీరామస్వామి దేవాలయంలో రామ నవమి, సీతా రాముల కళ్యాణ వేడుకలు ఈ ప్రాంతం ప్రజలు, భక్త జనానికి అతి ప్రదానంగా నిలుస్తాయి. కాగా పట్టణంలోని రైల్వే స్టేషన్ శ్రీరామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి, సీతా రాముల కల్యాణం నిర్వహిస్తారు. ఆలయాల కమిటీల నిర్వాహకులు భక్తులకు సీతా రాముల కల్యాణ వేడుకల అనంతరం మహా అన్నదాన కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.