రంగారెడ్డి

ఎంఆర్‌ఈఎమ్‌లో టెక్నికల్ ఫెస్ట్ - 2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 24: మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలోని కిష్ఠాపూర్‌లో గల మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైనె్సస్ కాలేజీలో రెండు రోజుల నుంచి జరుగుతున్న టెక్నికల్ ఫెస్ట్ శనివారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి జేఎన్‌టీయూ డైరెక్టర్ ఆఫ్ ఇవాల్యూవేషన్ కామాక్షి ప్రసాద్, డాక్టర్ కుమార్, వెంకటనారాయణలు పాల్గొన్నారు. విద్యార్థులు మారుతున్న కాలనికి అనుగుణంగా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకుసాగాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు పేపర్ ప్రజేంటేషన్, పోస్టర్ ప్రజేంటేషన్‌లో పాల్గొని తమదైన శైలిలో నైపుణ్య ప్రతిభను కనబరుస్తూ వివరించారు. ప్రిన్సిపాల్ శివకుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం కాలేజీకి ఎంతో గర్వకారణమన్నారు. కళాశాల చైర్మన్ వేముల మల్లారెడ్డి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు ఏర్పర్చడానికి ఎటువంటి సదుపాయాలు సైతం కల్పించడానికి కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ముందు నిలుస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వేముల కృష్ణారెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథిలు ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమం అనంతరం ఆయా వేదికల వద్ద విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రైల్వే హాస్పిటల్‌లో ‘వెల్ బేబీ షో’
హైదరాబాద్, మార్చి 24: నగరంలోని లాలాగూడలో ఉన్న సెంటల్ రైల్వే హాస్పిటల్‌లో దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘వెల్ బేబీ షో’ నిర్వహించారు. ఇద్దరు పిల్లల నిపుణులైన డాక్టర్లు ఆరు నెలల వయస్సు నుంచి 3 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల వరకు వారి వారి ఆరోగ్యం, పెరుగుదల, మెరుగైన ఆహారం తీసుకోవడం, కుటుంబ స్ధితిగతులు వంటివాటిని పరీక్షించి రెండు మూడు కేటగిరీల్లో ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేసిన చిన్నారులకు మహిళా సంఘం అధ్యక్షురాలు అర్చనా యాదవ్ బహుమతులను పంపిణీ చేశారు. అంతకు ముందు రెండు కూలింగ్ వాటర్ మిషన్లను సెంట్రల్ హాస్పిటల్‌కు బహుకరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ పద్మ, చీఫ్ స్ట్ఫా సర్జన్ డాక్టర్ ఎండి నాయక్ పాల్గొన్నారు.