రంగారెడ్డి

దుర్వాసనకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: మహానగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే సుమారు 4500 మెట్రిక్ టన్నుల చెత్తను నిల్వ ఉంచే శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఇపుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ క్యాపింగ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందనుంది. సుమారు 130 ఎకరాల స్థలంల 14 మిలియన్ల టన్నులకుపైగా చెత్తకుప్పలుగా కుప్పలుగా పేరుకుపోయిన చెత్తతో పరిసర ప్రాంతాలకు తీవ్ర దుర్వాసన వెదజల్లటంతో పాటు, భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయ. సమస్యలను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ రూ. 144 కోట్లను వెచ్చించి, డంపింగ్ యార్డుకు క్యాపింగ్ చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక అనుమతిని జారీ చేసింది. ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో రానున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పరిగణలోకి తీసుకుని, మున్ముందు పర్యావరణ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ క్యాపింగ్ చేయించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు క్యాపింగ్ పనులు జరుగుతున్నట్లు మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించించారు. పనులకు కాలపరిమితిని కూడా ప్రభుత్వం జీవోలో పొందుపర్చింది. వచ్చే జూన్ 15వ తేదీలోపు క్యాపింగ్ పనుల్లో మొదటి దశలో మొత్తం 300మిల్లీ మీటర్ల మందంతో మట్టింతో నింపాలని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీలోపు మొత్తం క్యాపింగ్ పూర్తి చేయాలని సర్కారు జీవోలో కాలపరిమితిని విధించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో శాస్ర్తియ పద్ధతిన మొత్తం ఆరు స్థాయిల్లో క్యాపింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు అయ్యే రూ. 144 కోట్ల వ్యయంలో యాభై శాతం నిధులు మేసర్స్ హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ సాలిట్ వెస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ, మిగిలిన మరో యాభై శాతం నిధులను జీహెచ్‌ఎంసీ భరించాల్సి ఉంటుందని సర్కారు సూచించింది.
625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను మొత్తం ఈ యార్డుకే తీసుకువస్తున్నారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న డంపింగ్ యార్డుకు క్యాపింగ్ చేసే ప్రక్రియ ప్రపంచంలో మరెక్కడ చేపట్టలేదని మయర్ బొంతు రామ్మోహన్ వ్యాఖ్యానించారు. జవహర్‌నగర్ క్యాంపింగ్‌కు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన సంస్థ టెర్రా కన్సల్ట్ లిమిటెడ్, హెచ్‌ఐఎంఎస్‌డబ్ల్యూతో కలిసి పనిచేయనున్నట్లు వివరించారు.