రంగారెడ్డి

తీరనున్న తాగునీటి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్18: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వందల కోట్లతో పైపులైన్లు, రిజర్వాయర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసిం ది. దీంతో తాగునీటి కోసం ప్రజ లు రోడ్డెక్కే రోజులు త్వరలోనే కనుమరుగుకానున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఆరు రిజర్వాయర్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపీ వివేక్ ఆధ్వర్యంలో చేపట్టగా, మంత్రి కేటీఆర్ గతేడాది షాపూర్ నగర్‌లో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రారంభించారు. మిగతా రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని జగద్గరిగుట్ట, చింతల్, పేట్‌బషీరాబాద్, సూరారంలో పనులు పూర్తయ్యాయి. ఆయా రిజర్వాయర్ల పరిధిలోని బస్తీ లు, కాలనీలకు ప్రస్తుతం నాలుగైదు రోజులకోసారి నీటిసరఫరా జరుగుతుంది. కొన్ని బస్తీలలో అసలు నీటి సరఫరానే ఉండేది కాదు. ఈ రిజర్వాయర్లు ప్రారంభిస్తే నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్య శాశ్వతంగా సమసిపోతుంది. గత ప్రభుత్వాల హయాంలో వేసవి వచ్చిందంటే చాలు ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొనేది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం కింద నిర్మించి న నాలుగు రిజర్వాయర్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం, పేట్‌బషీరాబాద్‌లో ఈ నెల 20న రిజర్వాయర్లను ఎమ్మెల్యే కేపీ వివేక్ ఆధ్వర్యంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాజు ప్రారంభించనున్నారు.

అంతిరెడ్డిగూడను ఎందుకు పంచాయతీగా చేయరు?
కొత్తూరు రూరల్, ఏప్రిల్ 18: బీసీ ఎమ్మెల్యే పరిపాలనలో రెడ్డిల పాలన కొనసాగడం ఏమిటని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్‌ను అంతిరెడ్డిగూడ గ్రామస్థులు ప్రశ్నించారు. బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను అంతిరెడ్డిగూడ గ్రామస్థులు అడ్డుకున్నారు. నందిగామ గ్రామ పంచాయతీలో ఉన్న అంతిరెడ్డిగూడను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఎందుకు ఏర్పాటు చేయలేదని, పంచాయతీ ఏర్పడకపోవడానికి రెడ్డిలే కారణమని గ్రామస్థులు శంకరయ్య, జగన్, నర్సింహ, దేపల్లి అశోక్‌గౌడ్, కుమారస్వామి గౌడ్, శ్రీకాంత్ ఎమ్మెల్యేకు వివరించారు. నందిగామ గ్రామానికి చెందిన కొంతమంది రెడ్ల మాటలు విని అతిరెడ్డిగూడను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయకపోవడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో రెడ్ల పాలన కొనసాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ అతిరెడ్డిగూడ గ్రామ పంచాయతీగా ఏర్పాటు కాకపోవడంతో ఎవరి హస్తం లేదని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. దాంతో సమస్య సద్ధుమణిగింది. ఎమ్మెల్యే పర్యటనను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న కొత్తూరు, నందిగామ ఎస్‌ఐలు శ్రీశైలం యాదవ్, హరిప్రసాద్ రెడ్డి తమ సిబ్బందితో హుటాహుటిన అతిరెడ్డిగూడ గ్రామానికి చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పి అక్కడి నుండి బయల్దేరి వెళ్లిపోయారు.

పామెన వార్డు మెంబర్లు ఆత్మహత్యా యత్నం
చేవెళ్ల, ఏప్రిల్ 18: పామెనలో జిల్లా చైర్‌పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలో అధికార పార్టీ వార్డు మెంబర్లు ఆత్మహత్యా యత్నం చేయడంతో స్థానికంగా కలకలం రేపింది. పలు అభివృ ద్ధి కార్యక్రమాలలో జిల్లా చైర్‌పర్స్‌న్, ఎమ్మెల్యే యాదవ్ పర్యటించారు. ప్రారంభోత్సవానికి పామెన గ్రామవార్డు మెంబర్లకు సమాచారం ఇవ్వలేదు. అవమానించారంటూ నాయకులు ఆరోపించారు. 1వ వార్డు మెం బర్ వెంకటేష్, నాలుగో వార్డు మెంబర్ సత్యనారాయణ చారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
చారిని ఎస్సై శ్రీ్ధర్ రెడ్డి అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.