రంగారెడ్డి

రైతులకు పరిహారం ఇప్పించాలని ఆర్‌డీఓకు వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఏప్రిల్ 19: డబుల్‌లైన్ రైల్వే నిర్మాణం పనుల్లో భూములు కొల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కొత్తూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రోళ్ల సురేందర్ డిమాండ్ చేశారు. గురువారం షాద్‌నగర్ ఆర్‌డీవో ఎం.కృష్ణకు రైతులతో కలిసి యూత్ కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. సురేందర్ మాట్లాడుతూ.. రైల్వే డబుల్‌లైన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని, వీటిలోభూములు కొల్పోయిన రైతులకు గజానికి ఆరువేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి సంబంధిత రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేయాలని ఆర్‌డీవోను కోరారు. ఇందుకు ఆర్‌డీవో ఎం.కృష్ణ స్పందిస్తూ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి డబుల్‌లైన్ రైల్వే పనుల్లో భూములు కొల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. రైతులు జంగగళ్ల జంగయ్య, తుప్పర రాములు, బ్యాగరి కృష్ణయ్య, తుప్పర నర్సింహ, జంగగళ్ల కృష్ణయ్య, బాలరాజు, రాజు, సమియేల్, సతీష్, రంజీత్‌కుమార్ పాల్గొన్నారు.

క్యారమ్ టోర్నీ బ్రోచర్ ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ క్రికెట్ సంఘం పర్యవేక్షణలో హైదరాబాద్ జిల్లా క్యారమ్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21, 22 తేదీల్లో ఛాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ప్రథమ కార్పొరేట్ క్యారమ్ ర్యాంకింగ్, ఓపెన్ క్యారమ్ ఫ్రైజ్ మనీ టోర్నమెంట్ నిర్వహిస్తారు. కార్పొరెట్ కోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులకు జాతీయ స్థాయి ర్యాంకింగ్(1 నుంచిడి 16 వరకు)లను ఇస్తామని నిర్వహకులు తెలిపారు. ఓపెన్ టోర్నమెంట్ స్విస్ లీగ్ పద్దతిలో నిర్వహిస్తారు. రూ.2లక్షల క్యాష్ ఫ్రైజ్ కలిగిన ఈ టోర్నమెంట్‌లో పురుషులు, మహిళల విభాగంలో సింగిల్స్, డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీలు జరుగుతాయి. కార్పోరెట్ టోర్నమెంట్‌లో పురుషులు, మహిళల విభాగంలో సింగిల్స్, డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీలు జరుగుతాయి. ఆలిండియా ఓపెన్ క్యారమ్ క్యారమ్ టోర్నమెంట్‌లో కేవలం సింగిల్స్, డబుల్స్‌లో మాత్రమే పోటీలు జరుగుతాయి. టోర్నమెంట్‌లో పాల్గొనే అసక్తిగల క్రీడాకారులు ఇతర పూర్తి వివరాల కోసం టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి నారాయణా ముదాలీయార్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. టోర్నమెంట్ ఈనెల 21న చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుంతుంది. కార్యక్రమంలో తెలంగాణ క్యారమ్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బీకే హరనాథ్, ఎస్.మధన్‌రాజ్, నిర్వహణ కార్యదర్శి ఎస్.శోభన్‌రాజ్ పాల్గొంటారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో టోర్నమెంట్ బ్రోచర్‌ను గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్యూన్ స్పోర్ట్స్ నిర్వహణ కార్యదర్శి నారాయణ్ ముదాలియార్ పాల్గొన్నారు.