రంగారెడ్డి

ఎల్‌డీపీ సర్ట్ఫికెట్ అందుకున్న శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న నగరానికి చెందిన కొంపల్లి శ్రీకాంత్‌కు ఎల్‌డీపీ సర్ట్ఫికెట్‌ను ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీనివాస్ నుంచి అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈనెల 16 నుంచి 20వరకు ఎల్‌డీపీ ఫర్ మీడియా శిక్షణ జరిగింది. మీడియా విభాగంలో రాష్ట్రం నుంచి వెళ్లిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీకాంత్ రెడ్డి పాల్గొని డైరెక్టర్ నుంచి సర్ట్ఫికెట్‌ను అందుకున్నారు.

ఏటీఎం.... నోక్యాష్
షాద్‌నగర్, ఏప్రిల్ 20: నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.. డబ్బులు విత్‌డ్రా చేసుకుందామని ఏ ఏటీఎంకు వెళ్లినా..నో క్యాష్ బోర్డులే వుంటున్నాయి. అసలే పెళ్ళిల సీజన్..ఖర్చులు ఎక్కువ..బ్యాంకుల్లో నగదు లభించకపోవడంతో..ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ వస్తువులు కొనుగోలు చేయాలన్నా..నగదు కావాల్సిందే..బ్యాంకుల వద్దకు వెళితే రూ.50వేలకు మించి నగదు ఇవ్వడం లేదు..ఇదేమిటంటే ఆన్‌లైన్ నగదు మార్పిడి చేసుకోండి అంటూ బ్యాంక్ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు..దాంతో ఏమిచేయాలో తెలియక సామాన్య ప్రజానీకం తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లో సకాలంలో డబ్బులు లభించకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉన్నప్పటికీ సకాలంలో అందుబాటులోకి రాక ఇతరుల నుండి వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పెద్దనోట్ల రద్ధు నిర్ణయం ఇంకా పట్టిపీడిస్తూనే ఉందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో నగదు సక్రమంగా లభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా వ్యాపార సంస్థలు వెలవెలబోతున్నాయి.
పట్టణంలో ఉన్న సుమారు 18ఏటీఎం కేంద్రాల్లో ఏ ఒక్కటీ పనిచేయడంలేదు. బ్యాంకుల్లోనైనా విత్‌డ్రా చేసుకుందామని డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు వెళితే ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రజలు నిరాష చెందుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వివిధ వర్గాల ప్రజలు కోరుతున్నారు.