రంగారెడ్డి

నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 20: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని జగద్గరిగుట్ట 126, 130వ డివిజన్‌లోని రాంరెడ్డినగర్, ఆర్‌జీకే, 132వ డివిజన్‌లోని ఎన్‌సీఎల్, గంగా ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా రూ. 220 కోట్లతో నిర్మించిన 4 రిజర్వాయర్‌లను వారు ముఖ్యఅతిథిలుగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో వారు మాట్లాడుతూ ఒకేరోజు నాలుగు రిజర్వాయర్లను ప్రారంభించడం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని పేర్కొన్నారు. నాలుగు రిజర్వాయర్లను ప్రారంభించడం చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ పనితీరు భవిష్యత్తు తరాలకు గుర్తిండిపోయేలా ఉందని వాఖ్యానించారు. నాలుగు రిజర్వాయర్ల ద్వారా నియోజకవర్గంలో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా అవుతుందని వివరించారు. దీంతో వేసవిలో తాగునీటి కష్టాలకు చరమగీతం పాడినట్లేనని చెప్పారు. గాజులరామారం పరిధిలోని రిజర్వాయర్ పనులు కూడా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని కొద్దిరోజుల్లో పనులు పూర్తవుతాయని అన్నారు. దీంతో నియోజకవర్గ పరిధిలో శాశ్వతంగా తాగునీటికి ఢోకా ఉండదని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆరు రిజర్వాయర్ల ద్వారా నీటి సరఫరా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ ప్రణాళికలతో ముందుకు వెళుతుందని వివరించారు. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి, కరెంట్ సమస్య ఉండేదని దీనికి శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం అయినందున సమైక్య రాష్ట్రంలో మూడు రోజులు మాత్రమే కరెంట్ సరఫరా ఉండేదని మన ప్రభుత్వం ఏర్పడ్డాక రెప్పపాటు కూడా కరెంట్ సమస్య లేకుండా చేశామన్నారు. దీని కారణంగా పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేదల జీవన విధానం మెరుగుపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా ముందుకువెళ్తున్న నియోజకవర్గం కుత్బుల్లాపూర్ అని అన్నారు. సీఏం కేసీఆర్ ఆశీస్సులు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలు సంపూర్ణంగా దోహదపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ చక్కటి ప్రణాళికతో ముందుకు వెళుతూ రాష్ట్రాన్ని దేశంలోనే ఆగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. దేశంలోని సమస్యలను అధిగమించగల దమ్ము ధైర్యం ఉన్న నేత కేసీఆర్ అని కొనియడారు. రానున్న రోజుల్లో సీఎం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందువరుసలో నిలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు ఆడుగబోమని ప్రకటించిన ధీశాలి సీఎం కేసీఆర్ అని దానిని వందకు వందశాతం మిషన్ భగీరథ పథకం ద్వారా నెరవేర్చుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపిపి సన్న కవిత, కార్పొరేటర్లు జగన్, విజయశేఖర్ గౌడ్, సత్యనారాయణ, శాంతి, కేఎం ప్రతాప్, డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, రాజేందర్ రెడ్డి, కేఎం గౌరీష్, జైరాం, రంగా రావు, బొడ్డు వెంకటేశం రావు, అధికారులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలి
కొత్తూరు, ఏప్రిల్ 20: ప్రమాదాల నివారణకు కార్మికులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇండియల్ ఆయిల్ పరిశ్రమ చీఫ్ ప్లాంట్ మేనేజర్ బాలరాజు వివరించారు. శుక్రవారం కొత్తూరు సమీపంలోని ఐఓసీ పరిశ్రమలో ప్రమాదాల నివారణపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఐఓసీలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను కార్మికులకు వివరించారు. ఐఓసీ కార్మికులకు ప్రమాదాల నుండి ఎలా బయట పడాలి..నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై పరిశ్రమల అధికారులు, ఫైర్ ఇంజన్ అధికారుల సూచనలు, సలహాలు చేశారు. ఐఓసీ ఆవరణలో కొన్ని సలహాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, వాటినుండి ఎలాంటి రక్షణ పొందాలనే విషయాలను కార్మికులకు వివరించారు. పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ఎప్పటికప్పుడు సేఫ్టీ పరికరాలు అందుబాటులో పెట్టుకోవడంతోపాటు నీరు నిల్వ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఓసీ ప్లాంట్ సీనియర్ మేనేజర్ డి.మోహన్‌రావు, అసిస్టెంట్ మేనేజర్ పి.అనిల్‌కుమార్, పరిశ్రమల శాఖ డిప్యూటీ ఛీప్ ఇన్‌స్పెక్టర్ వివి.శేషుకుమార్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, తిమ్మాపూర్ ఎంపీటీసీ సభ్యుడు ఎ.నర్సింహగౌడ్, షాద్‌నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాల పట్ల జాగ్రతలు తీసుకోవాలి
చేవెళ్ల, ఏప్రిల్ 20: అగ్నిప్రమాదల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమతంగా ఉండాలని చేవెళ్ల పంచాయత్‌రాజ్ డీఈఈ జగన్‌రెడ్డి, చేవెళ్ల అగ్నిమాపక అధికారి బిక్షపతి అన్నారు. శుక్రవారం అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా చేవెళ్లలోని ఫైర్ డిపార్టుమెంట్ కార్యాలయం ముందు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. ప్రమాదవశాత్తు మంటలు వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయంపై డెమో చేసి చూపించారు. ఒకవేళ మంటలు వచ్చినప్పుడు వాటిని సులువుగా అర్పే విధానంపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పైర్ సిబ్బంది కమలాకర్, వంశీకృష్ణ, ఆంజనేయులు, మల్లారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.