రంగారెడ్డి

మంచినీటి సమస్యలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 23: వేసవిలో మంచినీటి సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నందున ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. 29వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని అన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్‌లో భాగంగా షెడ్యూల్డ్ కులాల వారికి చెందవల్సిన ఉపకార వేతనాలు పొందేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు త్వరిత గతిన అందజేయాలని వివరించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బ తగలకుండా ఉండేలా చర్యలు, తీసుకోవాలని, అవగాహన కల్పించాలని అన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలకు నీరు పోసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 9న మేడ్చల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన 1500 మంది మహిళలతో తెలంగాణ రాష్ట్రం ఆకారంలో మానవాహారం నిర్వహించామని చెప్పారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నమోదు చేసి ప్రశంస పత్రాన్ని అందజేయటం గర్వంగా ఉందని కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌డీవో కౌటిల్య, డీఎంహెచ్‌వో దాస్యానాయక్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వరూపాణి, డీపీవో సురేశ్ మోహన్, జిల్లా క్రీడల అధికారి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా
బాలికల నిష్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి దాస్యానాయక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో జిల్లా అడ్వయిజరీ కమిటీ ఆధ్యర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దాస్యానాయక్ మాట్లాడుతూ.. ప్రతీ వెయ్యి మంది బాలురకు కేవలం 967మంది బాలికలు మాత్రమే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించి, లింగ నిర్ధారణ చేస్తున్నట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండు కేంద్రాల్లో కంటె ఎక్కువ సెంటర్లలో పని చేసే డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాల నుంచి రిపోర్టులు సరిగా రాకపోతే చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లు లింగ నిర్ధారణకు సహకరించినట్లయితే వేటు తప్పదని హెచ్చరించారు. త్వరలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాళాల సూరారం నందు రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు, ప్రైవేట్ వైద్యశాలల యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.