కరీంనగర్

మేడిగడ్డతో భూములు ముంపునకు గురైతే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రీ డిజైనింగ్ వివరాలు ప్రజల ముందుంచాలి
* మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
మహాదేవపూర్, మార్చి 7: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం పరస్పరం ఒప్పందం చేసుకునే ప్రక్రియలో మంథని నియోజకవర్గంలోని భూములు, ఊర్లు ముంపునకు గురైతే ఊరుకునేది లేదని మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీ్ధర్‌బాబు హెచ్చరించారు. సోమవారం ఆయన కాళేశ్వరంలో శివరాత్రి సందర్భంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకున్న అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పలు పథకాలను ప్రారంభించామని గుర్తుచేశారు. పేర్లు మార్చి మాటల గారడి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. నియోజకవర్గంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళలలో వాటర్ గ్రిడ్ పేరిట బ్యారేజిల నిర్మాణం చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పనులు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు ఇటు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటనలు చేయకుండానే ఒప్పందాలు చేసుకోవడం దారుణమని, ప్రజలను మోసం చేయడమేనని శ్రీ్ధర్‌బాబు విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తమ హయాంలోనే ప్రారంభించినప్పటికీ ఏడాది కాలం నుంచి నేటికీ పనుల్లో పురోగతి లేదని ఎద్దేవా చేశారు. అటవీ శాఖ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఉద్దేశ పూర్వకంగా పథకాలను అర్ధంతరంగా నిలిపివేయడం తగదన్నారు. రీ డిజైనింగ్ పేరిట ఏం చేయబోతున్నారో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేనియెడల ఈ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తాము సంకల్పం చేసిన పనులనే ఈ ప్రభుత్వం నేటికీ పూర్తిచేయడం లేదని అన్నారు. ప్రతి ఏకరానికి సాగునీరు అందించాలని, ప్రతి ఇంటికీ తాగు నీరు అందించాలని, ఒక్క ఎకరం కూడా ముంపునకు గురికాకుండా చూడాలని సిఎం కెసిఆర్‌ను కోరుతున్నామని శ్రీ్ధర్‌బాబు అన్నారు. మంథని నీళ్ళను మెదక్‌కు తరలించుకుపోయే ముందు ఇక్కడి వాసులకే ప్రథమ ప్రాధాన్యమియ్యాలని శ్రీ్ధర్‌బాబు డిమాండ్ చేశారు.