క్రీడాభూమి

లా లిగా ఫుట్‌బాల్ రేసులోనే రియల్ మాడ్రిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, నవంబర్ 30: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో రియల్ మాడ్రిడ్ జట్టు మళ్లీ రేసులోకి వచ్చింది. గత వారం బార్సిలోనాతో జరిగిన మ్యాచ్‌లో 0-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోవడంతో రియల్ మాడ్రిడ్ పాయింట్ల పట్టిలో మెరుగైన స్థానాన్ని అందుకునే అవకాశాలపై అనుమానాలు తలెత్తాయి. అయితే, ఎబార్‌తో జరిగిన మ్యాచ్‌ని 2-0 తేడాతో గెల్చుకోవడంతో ఈ జట్టు మూడో స్థానానికి దూసుకెళ్లింది. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చక్కటి గోల్‌తో రియల్ మాడ్రిడ్‌ను పటిష్టమైన స్థితిలో నిలిపాడు. అంతకు ముందు, మ్యాచ్ 43వ నిమిషంలో గెరెత్ బాలే చేసిన గోల్‌తో రియల్ మాడ్రిడ్‌కు 1-0 ఆధిక్యం సాధ్యమైంది. ఆ వెంటనే ఎబార్ ఆటగాళ్లు ఈక్వెలైజర్ కోసం తీవ్రంగా ప్రయత్నించడంతో రియల్ మాడ్రిడ్ ఆత్మరక్షణలో పడింది. ఎబార్‌కు కొన్ని అవకాశాలను చేజార్చుకోగా, రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు, ప్రత్యేకించి రొనాల్డో సందోర్భచితంగా ఆడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాడు. 82వ నిమిషంలో అతను చేసిన గోల్ రియల్ మాడ్రిడ్ ఆధిక్యతను 2-0కు చేర్చింది. ఈ దశలో గోల్స్ సాధించడం ఎబార్‌కు అసాధ్యంగా మారగా, విజయాన్ని నమోదు చేసిన రియల్ మాడ్రిడ్ మొత్తం 27 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. బార్సిలోనా 33 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అట్లెటికో మాడ్రిడ్ 29 పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో ఉంది. (చిత్రం) రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో