హైదరాబాద్

రికవరీలో సైబరాబాద్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

79 శాతంతో తెలంగాణలో ఫస్ట్..
* సరికొత్త రికార్డు సృష్టించిన సైబరాబాద్ పోలీసులు
గచ్చిబౌలి, డిసెంబర్ 29: సొత్తు రికవరీలో తమ రికార్డును తామే తిరిగి రాసుకుని తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో సైబరాబాద్ పోలీసులు నిలిచారు. 2015 కమిషనరేట్ పరిధిలో 30527 కేసులు నమోదు కాగా 28 కోట్ల 80 లక్షల రూపాయలు దోపిడీకి గురికాగా సైబరాబాద్ పోలీసులు 22 కోట్ల 61 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వార్షిక రిపోర్టును వెల్లడించారు. గత యేడాది 25547 కేసులు ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా ఈ యేడాది 30527 కేసులు నమోదయ్యాయని, గతం కంటే 4980 కేసులు ఎక్కువని తెలిపారు. పోలీసులంటే ప్రజల్లో భయం తగ్గిందని అందుకనే ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని సిపి వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో గత యేడాది 23 హత్యలు జరిగితే ఈ యేడాది 11 మాత్రమే జరిగాయని, డెకాయిట్స్ తగ్గగా, రాబరీలో, రాత్రి పగలు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడే కేసులు పెరిగాయని, సాధారణ దొంగతనాలు గత యేడాది 150 ఉంటే 2015లో 1561 జరిగాయని సిపి వెల్లడించారు. గత యేడాది గొలుసు దొంగతనాలు 793 జరిగితే ఈ యేడాది 372 జరిగాయని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎల్‌బినగర్ జోన్‌లో 8670 కేసులు నమోదు కాగా ఎల్‌బినగర్ పోలీసు స్టేషన్‌లో 1590 రికార్డు స్థాయిలో ఎఫ్‌ఆర్‌లా నమోదు చేశామని కమిషనరేట్ పరిధిలో అతి తక్కువ కేసులు 269 కందుకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైనట్లు ఆనంద్ చెప్పారు. మహిళా భద్రత కోసం షీ టమ్‌లు ఏర్పాటు చేయడంవలన మహిళలలో మనోధైర్యం పెరిగి కేసులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, గత యేడాది 2335 కాగా ఈ యేడాది 2518 కేసులు నమోదు అయినాయని అంతకంటే 8 శాతం పెరిగినట్లు సిపి పేర్కొన్నారు. సైబర్ నేరాలు తగ్గాయని, గత యేడాది 259 కాగా 2015లో 193 కేసులు నమోదు కాగా 800 ఫిర్యాదులు సంబంధితులతో మాట్లాడి పరిష్కరించామని కమిషనర్ చెప్పారు.
రికార్డు స్థాయిలో ట్రాఫిక్ చలాన్లు
ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో గత యేడాది ఇ8 లక్షల 24వేల 884 కేసుల్లో రూ.41.13 కోట్లు అపరాధ రుసుము వసూలు చేయగా 2015లో 13 లక్షల 56వేల 99 కేసులలో 55 కోట్ల 46 లక్షలు వసూలు చేసినట్లు ఆనంద్ చెప్పారు. ఎస్‌పిటి పోలీసులు గత యేడాది 1128 కేసులలో 13 కోట్ల 18 లక్షల 31వేల 479 రూపాయలు స్వాధీనం చేసుకోగా ఈ యేడాది 2192 కేసులలో 23 కోట్ల 34 లక్షల 87వేల 260 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు తూర్పు, పశ్చిమ రెండు బృందాలు ఉన్నాయని, 2016 జూన్‌కి ఒక ఎస్‌ఓటి బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సిపి వివరించారు.
ప్రమాదాలు 5 శాతం పెరిగాయి
సైబరాబాద్ గత యేడాది కంటే ఈ యేడాది 5శాతం ప్రమాదాలు పెరిగాయని, 1014లో 3329 జరుగగా, 2015లో 3499 ప్రమాదాలు జరిగాయని, ఇందులో 1156మంది మరణించారని తెలిపారు. పాస్‌పోర్టు విధానంలో అవలంభిస్తున్న విధానాలను విదేశీ వ్యవహారాల శాఖ కూడా ప్రశంసించడం జరిగిందని ఈ విధానన్ని తెలంగాణ రాష్ట్ర మంతటా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. గత సంవత్సరం లక్షా 3వేల 288, 2015లో 102239 పాస్‌పోర్టు జారీ చేసినట్లు చెప్పిన సిపి దేశవ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు ఆనంద్ తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మాస్టర్ హెల్త్ చెకప్‌లతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అదే రోజు వారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నామని తెలిపారు. ఐటి కారిడార్‌లో భద్రతతోపాటు ప్రజల భాగస్వామ్యంలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్లు సిపి పేర్కొన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పలు సభలు సమావేశాలు దిగ్విజయం నిర్వహించామని భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలలోకూడా ఇదే సమన్వయంతో పనిచేస్తామని ఆనంద్ తెలిపారు. ఈ యేడాదిలో మూడుసార్లు ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని పౌరుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రెండ్లీ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి శశిధర్, మాదాపూర్ డిసిపి కార్తికేయ, శంషాబాద్ డిసిపి శ్రీనివాస్, అడిషనల్ డిసిపిలు, ఎపిసిలు పాల్గొన్నారు.