రాష్ట్రీయం

రూ.2 కోట్ల ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 31: కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసు, అటవీశాఖ అధికారులు దాడులు ముమ్మరం చేస్తున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. గురువారం రైల్వేకోడూరు, బద్వేలు ప్రాంతంలోని శేషాచలం, లంకమల అటవీప్రాంతాల్లో రూ.2కోట్లు పైబడి విలువచేసే ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. బద్వేలులో సుబ్బారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సుబ్బయ్య, విజయ్, చంద్రశేఖర్, పెంచలయ్య అనే ఆరుగురు స్మగ్లర్లను అరెస్టుచేసి వారి నుంచి రూ.10లక్షలు విలువచేసే ఎర్రచందనం దుంగలు, నరికివేతకు ఉపయోగించే ఆయుధాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రైల్వేకోడూరు మండలం శేషాచలం అటవీప్రాంతంలోని బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద ఐషర్ వాహనంలో భారీఎత్తున తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది స్మగ్లర్లు, ఐషర్ డ్రైవర్ పరారీ అయ్యారు. వాటి విలువ రూ.కోటి 90లక్షలు పైబడే ఉంటుందని పోలీసులు అంచనావేశారు.