తెలంగాణ

ప్రాజెక్టుల రీ డిజైన్‌పై 30న అసెంబ్లీలో.. కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను రీ డిజైన్ చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించి శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసన సభలో సుదీర్ఘంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులు వాటి పరిస్థితి, గోదావరి కృష్ణా జలాల లభ్యత, ప్రస్తుత డిజైన్ వల్ల కలిగిన నష్టాలు, వాటిని మార్చడానికి కారణాలు, మార్పు వల్ల కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు. దాదాపు ఏడాది కాలం నుంచి ముఖ్యమంత్రి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించారు. ప్రాజెక్టులపై పూర్తి అవగాహనకు వచ్చిన ముఖ్యమంత్రి గత సమావేశాల్లోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శాసన సభ, శాసన మండలి సభ్యులకు ప్రత్యేకంగా వివరించాలని నిర్ణయించారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాల్లోనే ఉభయ సభల సమావేశం జరుగుతుంది.
ఉభయ సభలను ఉద్దేశించి ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసేందుకు సాంకేతికంగా అడ్డంకులు ఎదురవుతాయని గత సమావేశంలో భావించారు. సభలో వివిధ అంశాలపై వాకౌట్, సస్పెషన్షన్‌ల వల్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరగలేదు. అయితే సభలో సభ్యులందరికీ వివరింగా చెప్పిన తరువాతనే ప్రాజెక్టుల రీ డిజైన్ అమలు చేయాలని తొలుత ముఖ్యమంత్రి భావించారు. వివరించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం రీ డిజైన్‌ను ఆమోదించింది. కొత్త డిజైన్లతో పనులు జరుగుతున్నాయి, మహారాష్టత్రో ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రీ డిజైనింగ్ పూర్తి స్వరూపాన్ని శాసన సభ్యులకు వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈనెల 30న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారు. 30,31 తేదీల్లో సమగ్రంగా వివరించడంతో పాటు శాసన సభ్యుల సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు.ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారాం ఎత్తి పోతల పథకం, భక్తరాందాస్ ఎత్తిపోతల పథకం , మల్లన్న సాగర్, కొండా పోచమ్మ సాగర్ వంటి పలు ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేసిన విషయాన్ని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు.
శాసన సభలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసేప్పుడు శాసన మండలి సభ్యులను కూడా ఆహ్వానించాలని కొందరు టిఆర్‌ఎస్ శాసన మండలి సభ్యులు శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కోరారు.