జాతీయ వార్తలు

సంస్కరణలే రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో వాటిని కొనసాగిస్తాం
ఐఎంఎఫ్‌లాంటి సంస్థల్లోనూ చేపట్టాలి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆసియా ఆశాకిరణం
పురోగమన సదస్సులో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, మార్చి 12: భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పెరుగుతూ ఉన్నత స్థాయికి చేరుకుని పెట్టుబడుల కేంద్రంగా మారుతున్నా సంస్కరణలు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లాంటి సంస్థలు సైతం సంస్కరణలు చేపట్టాలసిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. సంస్కరణల అజెండా ఇంకా పూర్తి కాలేదంటూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి ఆసియా ఖండమే ఆశా కిరణమన్నారు. శనివారం న్యూఢిల్లీలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డ్‌తో కలసి ‘ఆసియా పురోగమన సదస్సు’లో మోదీ ప్రసంగించారు. ఆసియా ఖండానికి ఎన్నో ఏళ్లనుంచి చారిత్రక సేవలు అందిస్తున్న భారత్ ఆసియాలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, వేగవంతమైన ఆర్థికాభివృద్ధి కలసికట్టుగా ముందుకు సాగలేవన్న దురభిప్రాయాన్ని భారత్ పటాపంచలు చేసిందని, సామాజిక సుస్థిరతను పరిరక్షించడం ద్వారా భిన్న సంస్కృతులు కలిగిన పెద్ద దేశం సైతం ఎలా ముందుకు సాగగలదో రుజువు చేసిందన్నారు. ‘ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే ఆర్థికాభివృద్ధిలో భారత్ వేగవంతంగా సాధిస్తున్న పురోగతి భిన్నమైనది. భాగస్వాముల ప్రయోజనాలను దెబ్బతీసి వ్యాపారంలో లబ్ధి పొందేందుకు మేము ఎన్నడూ ప్రయత్నించలేదు. ప్రధానంగా స్థూల ఆర్థిక సుస్థిరత రంగంలోనే మేము ఎక్కువ విజయాలు సాధించాం’ అని మోదీ ఉద్ఘాటించారు. ఎంత గొప్ప విజయాలను సాధించినప్పటికీ అవినీతితో పాటు బ్యాంకులు, నియంత్రణా సంస్థల నిర్ణయాల్లో రాజకీయ జోక్యం వెంటాడుతున్నాయని, అయితే దేశంలో చేపట్టిన కొన్ని చర్యల ఫలితంగా పారిశ్రామిక రంగం ఊపందుకుంటోందన్నారు. దేశ జనాభాలో ఇప్పటికీ అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుండటంతో గ్రామీణ, వ్యవసాయ రంగాలకు పెట్టుబడులను పెంపొందించామని, రైతులకు నేరుగా చేతి సాయం అందించకుండా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని వివరించారు.(చిత్రం) న్యూఢిల్లీలో ప్రధాని మోదీ సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ