ఆంధ్రప్రదేశ్‌

రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా రిజిస్ట్రార్ వద్ద రూ. 66 వేలు నగదు స్వాధీనం
సబ్-రిజిస్ట్రార్ల పేర్లు రాసిన కవర్లలో దొరికిన నగదు
రాజమండ్రి, డిసెంబర్ 4: అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్ అధికారి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి లెక్కల్లో లేని సుమారు రూ.66వేల నగదు స్వాధీనంచేసుకున్నారు. రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని సబ్-రిజిస్ట్రార్లతో జిల్లా రిజిస్ట్రార్ వి రంగారెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందటంతో ఎసిబి డిఎస్‌పి పి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎసిబి ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ఇతర సిబ్బంది ఉదయం 10.30 గంటలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో జిల్లా రిజిస్ట్రార్ రంగారెడ్డి వద్ద సుమారు రూ.66,600 నగదు ఉన్నట్టు ఎసిబి డిఎస్‌పి రామచంద్రరావు గుర్తించారు. పైగా ఈ నగదు కవర్లలో ఉంది. సమావేశానికి వచ్చిన సబ్-రిజిస్ట్రార్లు కొంతమంది ఎవరికి వారు తమ పేర్లు రాసి మరీ కవర్లను జిల్లా రిజిస్ట్రార్‌కు అందించినట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. ఎసిబి అధికారులు తనిఖీ చేస్తున్నారన్న సమాచారంతో కొన్ని నగదు కవర్లు కార్యాలయం బయటకు ఎగిరినట్టు తెలుస్తోంది. కవర్లలో రూ.5000 నుండి రూ.2500 వరకు నగదు ఉంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం స్థాయిని బట్టి కవర్లలో నగదు ఉంది. ఎక్కువ లావాదేవీలు జరిగే కార్యాలయానికి సంబంధించిన సబ్-రిజిస్ట్రార్ పేరుతో ఎక్కువ మొత్తం ఉంటే, తక్కువ లావాదేవీలు జరిగే కార్యాలయానికి సంబంధించిన సబ్-రిజిస్ట్రార్ పేరుతో తక్కువ మొత్తం కవరులో ఉన్నట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. ఈ కవర్లతో సహా నగదును ఎసిబి అధికారులు స్వాధీనంచేసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్ రంగారెడ్డి కార్యాలయానికి వచ్చిన తరువాత తన వద్ద రూ.500 నగదు ఉన్నట్టు రిజిస్టర్‌లో నమోదుచేశారని, అందువల్ల జిల్లా రిజిస్ట్రార్ వద్ద లభించిన రూ.66వేల 600నగదులో రూ.66వేల 100 నగదుకు లెక్క చెప్పాల్సి ఉంటుందని ఎసిబి డిఎస్‌పి రామచంద్రరావు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. దీనికి సంబంధించిన లెక్కలు ఇంకా తమకు అందలేదని, ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో జిల్లా అధికారి రంగారెడ్డిని ఆసుపత్రికి పంపించామని డిఎస్‌పి చెప్పారు. సమావేశానికి వచ్చిన సబ్-రిజిస్ట్రార్లను ఎసిబి అధికారులు విచారించి, వాంగ్మూలం నమోదుచేశారు. ఉదయం 10.30గంటల నుండి సాయంత్రం వరకు కార్యాలయంలో సోదాలు జరుగుతూనే ఉన్నాయి. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి అధికారులు అనేక సార్లు ఆకస్మిక దాడులు నిర్వహించి లెక్కల్లో చూపించని నగదును స్వాధీనంచేసుకున్న సంఘటనలు జిల్లాలో చాలాసార్లు జరిగాయే తప్ప, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో లెక్కల్లో చూపించని నగదును స్వాధీనంచేసుకోవటం ఇదే తొలిసారి.