రాష్ట్రీయం

క్రమబద్ధీకరణకు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్‌శాఖ
హైదరాబాద్, డిసెంబర్ 31: అనధికార భవనాలు, అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువును జనవరి 31వ తేదీ వరకు పొడగిస్తూ మున్సిపల్ పాలనా, పట్టణాభివృద్ధిశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనధికార భవనాలు, అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరణకు గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. రాష్టవ్య్రాప్తంగా అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, అలాగే అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం గత అక్టోబర్ 31వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తుల స్వీకరణకు నవంబర్, డిసెంబర్ రెండు మాసాల వరకు 60 రోజుల పాటు గడువు విధించింది. అయితే క్రమబద్ధీకరణపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, పైగా ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో దరఖాస్తు చేసుకోవడానికి పెద్దగ స్పందన లభించలేదు. దీంతో వీటికి మరో రెండు నెలలు పాటు గడువు పెంచాల్సిందిగా వివిధ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. దీంతో రెండు నెలలు కాకుండా ఒక నెల పాటు జనవరి 2016 వరకు గడువు పెంచుతూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.