ఈ వారం కథ

ఆస్తులు కాదు.. ఆప్యాయతలే పదిలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటపుడు పెద్ద కుటుంబాన్ని చూసి ఇచ్చేవారు. ఆడపడుచులు, మరుదుల చెణుకులతో హాయిగా, ఆనందంగా గడిపేవారు. ఇప్పుడలా కాదు. పెద్దలే ఆడపిల్లకు అన్నీ నచ్చచెపుతున్నారు. తల్లి కల్పించుకుని, ‘‘మంచి సంబంధం ఒప్పుకో అమ్మా..’’ అని బతిమాలుతూ- ‘‘ఆడబిడ్డలు లేరు, అత్తగారు కిందటేడే పోయిందట.. మామగారు మొన్ననే రిటైరైపోయాడు.. మరిది హైదరాబాదులో బ్యాంక్ ఉద్యోగి... సెంటర్లో నాలుగు షాపులు.. పైన రెండు ఫోర్లు.. స్థలాల ధరలు పెరిగిపోయి లక్షల్లో వున్న ఆస్తి కోట్లకి చేరింది. భార్య పోయాకా ఎన్నాళ్ళు బతుకుతాడాయన? స్వతంత్రం స్వర్గలోకం లాంటిది..’’ భార్య కూతురికి చెపుతున్న ఆ మాటలు రామారావుకి వెగటు కలిగించాయి. రేపు మనింటికొచ్చే కోడలు కూడా ఇలాగే కోరుకుంటే..?
* * *
రామ్‌కోటిలో మేనల్లుడి పెళ్లికి వెళ్లిన విశ్వానికి- ‘రారా.. ఏమిటి ఇంత లేటు?’ అంటూ కొలీగ్ ఆహ్వానించాడు. అక్కడ రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కుర్రాళ్ళ మధ్య కబుర్లు ఇలా...
‘మీ మేనమామ కూతురు ఈ పెళ్ళికి వచ్చిందా?’ ఒకతను అడిగేడు.
‘వచ్చిందిరా... ముందు వరుసలో కూర్చున్న ఆ అనకొండ మా అత్త, ఆ అగ్గిపుల్ల నా మరదలు’ దిగులుగా అన్నాడు.
‘అమ్మాయి చాలా బాగుంది కదా... ఎందుకురా ఏడుస్తూ చెపుతావు?’ అన్నాడు.
‘ఇప్పుడు బాగానే వుంది. వాళ్ళమ్మ వయసు వచ్చేసరికి ఇది కూడా అనకొండలా... ఎందుకంటే ఆవిడ కూడా పెళ్ళినాటికి ఇలాగే వుండేదట... ఇంతకన్నా స్లిమ్‌గా ఫొటోలు వున్నాయి మా ఆల్బంలో..’
‘ఓరి.. నీ అసాధ్యం కూలా.. అమ్మాయిలు దొరక్క అందరం చస్తుంటే అందమైన మరదలిని భవిష్యత్తులో లావెక్కుతుందని...’ అంటూ వాయించేశాడు.
ఇంతలో విజ్జి కనిపించింది. అది నా మేనత్త కూతురు. చాలా కాలానికి కలిశాం. బంధుత్వాలు... ఆప్యాయతలు.. మెల్లమెల్లగా కనుమరుగు అయిపోతున్నాయి. నాలుగు అడుగులు దానివైపు వేశానో లేదో నా భుజం మీద చెయ్యి పడింది. తిరిగి చూశాను క్రిష్ణుడు బావ..!
‘ఈ వూరు ఎప్పుడొచ్చావు?’ అడిగేను ఆశ్చర్యంగా.
‘నేను రిటైరైపోయానురా.. అద్దె వాళ్ళని ఖాళీ చేయించి సొంత ఇంటికి చేరుకున్నాను.
‘ఎన్నాళ్ళు అయిందిరా? నాకు తెలియచేయలేదేం? అని అడిగేను.
‘మీ ఆవిడకి నా మాటలు నచ్చవు. ఆవిడ మాట తీరు నన్ను బాధపెడుతుంది. మా ఇద్దరి మధ్య నువ్వు బాధపడకూడదని...’ ఎటో చూస్తు అన్నాడు.
అవును.. అందరినీ తీసిపారేసినట్లు మాట్లాడుతుంది. కామేశ్వరివల్ల బంధువులే కాదు, కొంతమంది స్నేహితులు కూడా నాకు దూరమయ్యారు. విజ్జి నన్ను చూసి నా దగ్గరకి వచ్చింది. కిష్ణుడిని పరీక్షగా చూసి ‘ఈయన్ని ఎక్కడో చూసిన గుర్తు ఎవరు..?’ అని అడిగింది.
‘వీడు నీకు అన్నయ్య అవుతాడు. మీ పెద్దమ్మ కొడుకు... ఇక ఈవిడ మీ పిన్ని కూతురు పార్వతి... మీ ఇద్దరినీ ఒకరి నొకరికి పరిచయం చేయవలసి రావడం నా దురదృష్టం. తోడళ్ళుళ్ళ మధ్య గొడవ. అక్కచెల్లెళ్ళు విడిపోయారు. ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నాయి...
ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. ‘‘పెద్దలు పైకెళ్ళిపోయారు, ఇక మీరందరూ కలసి పొండి’’ అన్నాను.
‘మా చెల్లెళ్ళు ముగ్గురూ అయోధ్యనగర్‌లో స్వంత అపార్ట్‌మెంట్‌లు కొనుక్కున్నారు. వాళ్ళందరిని నీకు పరిచయం చేస్తానురా..’ అని వాడు ఆహ్వానించాడు.
విజ్జి అతని స్కూటర్ ఎక్కింది. దశాబ్దాల క్రితం విడిపోయిన వారిని కలిపేను. ఆనందంతో నా మనసు నిండిపోయింది.
నాకు ఫేమిలీతో పెళ్ళికెళ్ళే యోగం లేదు. అలా కొన్నిసార్లు వెళ్ళి.. అక్కడ మా ఆవిడ మాటలతో నాకు విరక్తి వచ్చి- దాన్ని ,పిల్లల్ని తీసికెళ్ళడం మానేశాను.
ఒక పెళ్ళిలో తులసి కనిపించింది. ‘మా తులసి’ అని మా ఆవిడతో అన్నాను.
‘మీ పిన్ని కూతురు తులసీయేనా? వేరే మతం వాడితో లేచిపోయిందని చెప్పుకుంటారే ఆ అమ్మాయేనా?’ అంది పెద్ద గొంతుతో.
మా ఆవిడ మాటలు తులసికి వినబడే వుంటాయి.
‘నోర్ముయ్... తులసి, విల్సన్ ప్రేమించుకున్నారు. దానికి మా బాబాయ్ రిజిష్టరాఫీసులో దగ్గరుండి పెళ్ళిచేసి పంపేడు. వాళ్ళిద్దరూ నెల్లూరులో పేరున్న డాక్టర్లు. ఎక్కడికైనా తీసుకువస్తే ఇలాగే చెత్తవాగుడు వాగి నా పరువు తీస్తావు. ఇంకెప్పుడూ నేను ఫేమిలీతో ఏ ఫంక్షన్‌కి రాకూడదని నిశ్చయించుకుంటున్నా.’ అన్నాను.
అంతకుముందు పెళ్ళిలో వివేకానంద కనిపించాడు. వీడు మా పెద్దమ్మ కొడుకు అని భార్యకు పరిచయం చేశాను.
‘ఏమయ్యా... మీ తల్లితండ్రుల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశావుట కదా..’ అని అడిగేసరికి వాడు తెల్లముఖం వేశాడు. మా ఆవిడ అన్న మాటలకు వాడికి ‘సారీ’ చెప్పి పంపేశాను.
మా పెదనాన్నకి కోడలితో పడలేదు. ఇల్లు అరవై సంవత్సరాల క్రితం కట్టింది. మా పెద్దమ్మకి ఆధునికమైన అపార్ట్‌మెంట్లో వుండాలనే కోరిక. ఇంటిని పడగొట్టి అపార్ట్‌మెంట్స్‌కిద్దామంటే వివేక్ ఒప్పుకోలేదు. ఆడపిల్లకి కూడా ఆస్తి హక్కు అంటూ వాళ్ళ చెల్లి ఖ్యాతి గొడవపెట్టి లాగేస్తుందని వాడి భయం. చెల్లెలు ఒంగోలులో పెద్ద లాయర్, దాని భర్త కూడా లాయరే. గుడివాడలో మరో ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళ భర్తలు పురోహితులు. 1985 తరువాత పెళ్ళయిన ఆడపిల్లలందరికీ ఆస్తి హక్కువున్నదని ఓ లాయర్ అన్నాడు. అంతే.. మా వాడికి భయం పట్టుకుంది! ఆడపడుచులను అసలు పలకరించేది కాదు. మావాడు ఆమెతో ఘర్షణ పడలేక పేరెంట్స్ వంక చూడటం కూడా మానేశాడు. ఆ పరిస్థితిలో పెద్దనాన్న రిటైరయినాక డబ్బు వచ్చింది. పెన్షన్ కూడా పాతికవేలు. ఇదే మంచి సమయం అని వచ్చిన డబ్బుతో అపార్ట్‌మెంట్ కొనుక్కుని వెళ్ళిపోయారు.
* * *
ఇప్పుడు తరచుగా ఆడపిల్లలు పుట్టింటికి వస్తున్నారు. వచ్చే ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తారు. వాడు వెంటనే వచ్చేస్తాడు. జోకులు, సినిమాలు, కథలూ కాక పేరెంట్స్‌తో హాయిగా కబుర్లు.. వాడి జీవితంలో ఆనందం మొదలైంది. భార్య కారణంగా కన్నవాళ్ళని పలకరించకుండా.. ఇన్నాళ్ళు నరకం చవిచూశాడు మరి.

-వేమూరి అనూరాధ