రాష్ట్రీయం

పోలీసు ఉద్యోగాల వయోపరిమితి సడలింపుపై జీవో జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితిని సడలిస్తూ ప్రభుత్వం సోమవారం జివో జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్)కి విడుదలైన జివో ఎంఎస్ నెం. 315 ప్రకారం ఒక ఏడాది పాటు జరిగే నియామకాలకు మాత్రమే ఈ జివో వర్తిస్తుంది. పోలీసు శాఖలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖలోని నియామకాలకు ఈ జివో వర్తిస్తుంది. పోలీసు శాఖలోని వివిధ కేటగిరిలలో జరిగే నియామకాలు ఈ జీవోను అనుసరించే జరుగుతాయి.

పోలీసుల బందోబస్తు భత్యం పెంపు
జిహెచ్‌ఎంసి పరిధిలో రూ. 200
జిల్లాల్లో రూ. 150
హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణలో బందోబస్తుకు కేటాయించిన పోలీసులకు రోజూవారి భత్యం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు బందోబస్తుకు కేటాయించిన సిబ్బందికి రోజుకు రూ. 200, జిల్లాలో బందోబస్తుకు కేటాయించిన పోలీసులకు రూ. 150లు పెంచింది.