ఆంధ్రప్రదేశ్‌

రేపే మహానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 25: విశాఖలో ఈనెల 27 నుంచి జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం నాటికి ఈ ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. ప్రధాన వేదిక తుది మెరుగులు దిద్దుకుంటోంది. సుమారు 35వేల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సుమారు 700మంది ప్రధాన నాయకులకు ఇక్కడి హోటల్స్‌లో బస సిద్ధం చేశారు. అలాగే విశాఖ అందాలను తిలకించడానికి ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి అరకు వెళ్లాలనుకున్న వారికి పర్యాటక శాఖ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తోంది.
ఈ మహానాడు ద్వారా 2019ఎన్నికలకు దిశా నిర్దేశం చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా తీర్మానాలను రూపొందించారు. వీటిలో ప్రధానంగా జాతీయ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ పాత్ర, అంతర్జాతీయంగా తాజా పరిణామాలు, తెలుగువారిపై ప్రభావం అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. బిజెపితో పొత్తు గురించి ఇప్పుడే మాట్లావద్దని తెలంగాణ మహానాడులో చంద్రబాబు స్పష్టం చేశారు. అదే ఫార్ములాను ఏపిలో కూడా అమలు చేస్తారా? లేకుంటే, బిజెపికి స్నేహ హస్తాన్ని కొనసాగిస్తూ తీర్మానం చేస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. అలాగే, మహిళ, బిసి, చేనేత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ ఈబిసి రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు. గడచిన మూడేళ్లలో తాత్కాలిక రాజధానిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కొత్త రాజధాని అమరావతిపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. వీటన్నింటికీ మించి నదుల అనుసంధానం, పోలవరం సాధనపై చంద్రబాబు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. బిజెపితో పొత్తు కొనసాగించాలనుకుంటున్న చంద్రబాబు ప్రత్యేక హోదాకు బదులుగా తీసుకున్న ప్యాకేజీ గురించి ప్రజలకు మరోసారి వివరించే ప్రయత్నం చేయనున్నారు. వీటితోపాటు, ప్రతిపక్షాన్ని కూడా ఈ మహానాడు వేదికగా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.