నల్గొండ

శాసనమండలి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మిర్యాలగూడలో ఓటు వేయనున్న
236మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
మిర్యాలగూడ, డిసెంబర్ 25: ఈనెల 27న జరిగే స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికను మిర్యాలగూడలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, కట్టుదిట్టంగా నిర్వహించేందుకుగాను అన్ని ఏర్పాట్లను చేశారు. మిర్యాలగూడ డివిజన్ పరిదిలోని 236మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిలు మిర్యాలగూడలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల బకల్‌వాడలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈపోలింగ్ కేంద్రంలో మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్లు, హుజూర్‌నగర్ నగరపాలక కౌన్సిలర్లు, 11మంది జడ్‌పిటిసిలు, 167మంది ఎంపిటిసిలు ఓట్లు వేయనున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటిలో 37మంది, హుజూర్‌నగర్ నగరపంచాయితీలో 21మంది కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదేవిధంగా పెద్దవూర మండలంలోని 15మంది ఎంపిటిసిలు, అనుముల మండలంలోని 18మంది ఎంపిటిసిలు, నిడమనూరు మండలంలోని 15మంది ఎంపిటిసిలు, త్రిపురారం మండలంలో 13మంది ఎంపిటిసిలు, వేములపల్లి మండలంలోని 13ఎంపిటిసిలు, మిర్యాలగూడ మండలంలోని 19మంది ఎంపిటిసిలు, దామరచర్ల మండలంలోని 19మంది ఎంపిటిసిలు, నేరేడుచర్లమండలంలోని 12మంది ఎంపిటిసిలు, మఠంపల్లిలోని 13మంది ఎంపిటిసిలు, హుజూర్‌నగర్ మండలంలోని 7గురు ఎంపిటిసిలు, గరిడేపల్లి మండలంలోని 16మంది ఎంపిటిసిలతోపాటు 11మండలాల్లోని 11మంది జడ్‌పిటిసిలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు
సూర్యాపేట, డిసెంబర్ 25: ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సమాజసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెడు అలవాట్లు, వ్యసనాలపై స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సూర్యాపేట నిర్వాహకురాలు డాక్టర్.శ్రీలత మాట్లాడుతూ పొగాకులో 45వేల రసాయనాలు ఉన్నాయని, పొగాకు తాగినచో లివర్‌క్యాన్సర్ రావడమే కాకుండా మనిషి జీవన ప్రమాణం అంతరించిపోతుందన్నారు. ధూమపానం, గుట్కా, పాన్, మద్యపానం సేవించడం అలవాట్ల వలన ఆరోగ్యం చెడిపోయి క్యాన్సర్,టిబి,నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. పారిశుధ్య కార్మికులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తమపైనే ఆధారపడి ఉన్న కుటుంబ అభివృద్ధికి పాటుపడాలని, పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ధూమపానం, మద్యపానం నిషేదంపై పారిశుధ్యకార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌సభ్యులు బికె.మాధవి, అనంతుల మురళి, ఎన్.మనోహర్‌రెడ్డి, వి.శంకర్, జనార్ధన్‌రావు, బికె.సైదులు, పి.సత్యనారాయణ, మున్సిపల్ శానిటరి ఇన్స్‌స్పెక్టర్‌లు బండ జనార్థన్‌రెడ్డి,సారగండ్ల శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ సురిగి శంకర్, శానిటరి జవాన్‌లు పాల్గొన్నారు.