రాష్ట్రీయం

క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: క్రైస్తవమతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చెప్పడం సరికాదని బిజెపి యువమోర్చ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోకి కులాలకు తావులేదని మత పెద్దలు ఇప్పటికే అనేక మార్లు ప్రకటించారని, సమాజంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం సూచించిందని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. సమాజానికి దూరంగా అంటరాని వారి కోసం , వారికి సమాజంలో స్థానం కల్పించడానికి రిజర్వేషన్లు, రాజ్యాంగంలో అంబేద్కర్ ప్రతిపాదించారని, మతం మారిన వారికి రిజర్వేషన్లు ఇవ్వరాదని రాజ్యాంగం పేర్కొందని అన్నారు. మతం మారిన ఎస్సీలను బిసి-సిగా గతంలోనే గుర్తించడం జరిగిందని, మతం మారిన దళితులకు యధావిధిగా ఎస్సీ రిజర్వేషన్లు అమలుచేస్తామని అనడం సరైదనది కాదని, దీనివల్ల నిజమైన దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యను దళిత సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఈ చర్య మత మార్పిడులను ప్రోత్సహించే విధంగా ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి సైతం దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని చూసినప్పుడు దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. దళిత సంఘాల ఒత్తిడికి తలొగ్గిన వైఎస్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు.