రాష్ట్రీయం

వరంగల్, ఖమ్మంలో రిజర్వుడు స్థానాల ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌లో మొత్తం 58 వార్డులను రిజర్వ్ స్థానాలుగా ప్రకటించారు. ఎస్సీ జనరల్ 5, ఎస్సీ మహిళ 4, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, బిసి జనరల్ 10, బిసి మహిళ 9, జనరల్ మహిళ 15, జనరల్ స్థానాలు 13. ఇక ఖమ్మంలో మొత్తం 50 స్థానాలు రిజర్వ్ డివిజన్లుగా ప్రకటించారు.ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ 3, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, బిసి జనరల్ 9, బిసి మహిళ 8,జనరల్ మహిళ 13, జనరల్ 12 డివిజన్లు. జనవరి చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తంతంగం మొత్తం పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు హైదరాబాద్ ఎన్నికల తరువాతనే జరుగుతాయి. గ్రేటర్ ఎన్నికలు ముగియగానే వెంటనే మిగిలిన ఎన్నికలు పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.