గుంటూరు

రిజర్వాయర్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నగరంలో కమిషనర్ నాగలక్ష్మి తొలి పర్యటన
గుంటూరు , డిసెంబర్ 8: ఇన్‌టేక్‌వెల్, పైపులైన్ల ఏర్పాటు, రిజార్వయర్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిరంతరం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ నిర్మాణాలపై ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. తాజాగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ నాగలక్ష్మి మంగళవారం నగరంలో తొలిగా పర్యటించారు. కృష్ణాబ్యారేజ్, ఉండవల్లి, తక్కెళ్లపాడు, నెహ్రూనగర్, సుద్దపల్లిడొంక, నాయిబ్రాహ్మణ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎపి ఎండిపి పథకం పనులు, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. నిర్ణీత సమయాల్లోగా ఆయా నిర్మాణ పనులను పూర్తయ్యేలా చూడాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఎపి ఎండిపి పనులను తాము ప్రత్యక్షంగా రోజూ తనిఖీ చేస్తామని, ఉండవల్లి వద్ద పైపులైన్ పనులు చేపట్టేందుకు అడ్డుగా ఉన్న అవాంతరాలను త్వరితగతిన తొలగించి పైపులైను నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. నగరంలో కూడా సమగ్ర మంచినీటి పథకం పైపులైను ఏర్పాటు చేసేందుకు తీస్తున్న గుంటలను సక్రమంగా పూడ్చటంలేదనే ఫిర్యాదులు అందుతున్నాయని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అనంతరం నగరంలోని సుద్ధపల్లిడొంక, నాయిబ్రాహ్మణ కాలనీల్లో పర్యటించిన కమిషనర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డోర్‌టుడోర్ చెత్త సేకరించే విధానం, రోడ్లు, సైడుకాల్వలను ఏ సమయంలో శుభ్రం చేస్తున్నారు అనే విషయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెత్త తరలించే వాహనాలు మరమ్మతులకు గురైతే వెంటనే బాగు చేయించాలన్నారు. నగరంలో ప్రధాన రహదారులు, డివైడర్లపై, జంక్షన్లలో అనధికారికంగా బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. కమిషనర్ నాగలక్ష్మి వెంట పర్యటనలో ఎస్‌ఇ గోపాలకృష్ణారెడ్డి, ఎంహెచ్‌ఒ నాగేశ్వరరావు, బయాలజిస్ట్ వీర్రాజు, ఇఇలు నాయక్, వెంకట్రావ్, డిఇలు జి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శాంతిరాజు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.