బిజినెస్

దిగివచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

16వ నెలా మైనస్‌లోనే టోకు ద్రవ్యోల్బణం
పెరిగిన వడ్డీరేట్ల కోతల అంచనాలు

న్యూఢిల్లీ, మార్చి 14: గత నెలలో ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్టానికి దిగివస్తే, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం వరుసగా 16వ నెల మైనస్‌కే పరిమితమై (-)0.91 శాతంగా నమోదైంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షలో తప్పకుండా వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయి.
సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.18 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 5.69 శాతంగా ఉంది. కూరగాయలు, పప్పు్ధన్యాలు, పండ్లు తదితర ఆహార పదార్థాల ధరల్లో మందగించిన పెరుగుదలే తాజా గణాంకాల తగ్గుదలకు కారణం.
ఇక టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత హోల్‌సేల్ ద్రవ్యోల్బణం -0.91 శాతంగా ఉంది. జనవరిలో ఇది -0.90 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం గణాంకాలు అదుపులోనే ఉండటం, మరోవైపు పారిశ్రామికోత్పత్తి పడకేయడం వంటివి కీలక వడ్డీరేట్లయిన రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను తగ్గించే దిశగా ఆర్‌బిఐని నడిపిస్తాయన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అంతేగాక వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో జిడిపిలో ద్రవ్యలోటును 3.5 శాతానికి కట్టడి చేస్తామని లక్ష్యంగా పెట్టుకోవడం కూడా వడ్డీరేట్ల తగ్గింపునకు ఆర్‌బిఐని నడిపిస్తుందని అంటున్నారు. ఏప్రిల్ 5న 2016-17 తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్షను ఆర్‌బిఐ ప్రకటించనుంది.