అంతర్జాతీయం

హాయిగా..ఆరోగ్యంగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవీ విరమణ జీవితంపై తాజా పరిశోధన
మెల్బోర్న్, మార్చి 12: ఏ చీకూచింతా లేకుండా, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండే పదవీ విరమణ జీవితం (రిటైర్‌మెంట్ లైఫ్)లో ఆరోగ్యమే ఆరోగ్యం. వేళకు తినవచ్చు.. హాయగా నిద్రపోవచ్చు. ఇదీ పదవీ విరమణ జీవితం గురించి తాజాగా జరిగిన ఓ అధ్యయన ఫలితం. ఉద్యోగం చేసినంతకాలం ఏదో రకమైన సమస్య వెంటాడుతూనే ఉంటుందని, పదవీ విరమణ తర్వాత ఆయా వ్యక్తుల క్రియాశీలత పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా పనిచేస్తున్న వారికంటే కూడా పదవీ విరమణ చేసిన వారిలో ఎంతో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోందని, అందుకు కారణం అన్ని రకాల ప్రతికూల అలవాట్లకు దూరం కావడమేనని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 25వేల మంది జీవన విధానాన్ని, ఆహార అలవాట్లను పరిశీలించారు. వీరందరిలో శారీరక చురుకుదనం, సమయానికి నిద్రపోయేతత్వం, ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటివి స్పష్టంగా కనిపించాయని తెలిపారు. ఇంకా ఉద్యోగం చేస్తున్న వారితో పోలిస్తే పదవీ విరమణ చేసినవారే శారీరకంగా ఎక్కువ శ్రమిస్తున్నారని, ఒకేచోట గంటల తరబడి కూర్చుండి పోకుండా చురుకుదనాన్ని పెంపొందించుకుంటున్నారని తెలిపారు. అన్ని విధాలుగా జీవనశైలిలో సానుకూల మార్పులను తీసుకురావడానికి పదవీ విరమణ జీవితం సరికొత్త అవకాశాలను ఇస్తోందని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మెలోడీ డింగ్ తెలిపారు.