తెలంగాణ

కెసిఆర్ భజనలో తరిస్తున్న బిజెపి, కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్‌కు భజన చేయడంలో బిజెపి, కాంగ్రెస్ నేతలు నిమగ్నమైపోయారని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. నెంబర్ వన్ సిఎం కెసిఆర్ అని బిజెపి నేతలు పొగుడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలకు బిజెపి అవసరం ఏముంటుందన్నారు. కెసిఆర్ పథకాలపై కాంగ్రెస్ నేతలు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ నాయకుల పనితీరుపై విసుగెత్తిన తెలంగాణ ప్రజలు ఇపుడు టిడిపి వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అయితే నేడు కెసిఆర్ కుటుంబం అధికారాన్ని అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు గతంలో పార్లమెంటు ఆమోదం తెలిపిందని, అదే పార్లమెంటులో రూపొందిన 2013 భూ సేకరణ చట్టాన్ని మాత్రం కెసిఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు.