తెలంగాణ

ప్రాజెక్టుల ఒప్పందంపై అబద్దాలు చెబుతున్న కేసీఆర్‌!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి ప్రాజెక్ట్‌ల ఒప్పందంపై అబద్దాలు చెబుతున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం విమర్శించారు. 2012లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌-మహారాష్ట్ర మధ్య
ఒప్పందం జరిగిందని తెలిపారు. వాడుకునే నీళ్ల ప్రాతిపదికన బట్టి ఖర్చులను భరించాలని, ప్రాజెక్ట్‌ ఎత్తు అంశాన్ని కూడా ఒప్పందంలో చేర్చారని పేర్కొన్నారు. 160 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా బ్యారేజీ నిర్మించుకోవచ్చని ఒప్పందంలో ఉందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 1975లో, 2012లో ఒప్పందాలలో క్రోడీకరించిన అంశాలను వాటిని మార్చివేసి 2016లో సీఎం కేసీఆర్‌ చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో సంబంధిత డాక్యుమెంట్స్‌తో వివరాలను ఆయన వెల్లడించారు.