మహబూబ్‌నగర్

నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు పొందిన కేసులో బ్యాంకు, రెవిన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 11: నకిలీ పాసు పుస్తకాలతో బ్యాంకులో రుణాలు పొందిన సంఘటనలో బ్యాంకు అధికారులతోపాటు రెవెన్యూ అధికారుల పాత్ర ఉండవచ్చునని భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్, బాలానగర్ గ్రామాలలోని ఎపిజివిబి బ్యాంకు ద్వారా ఎనిమిది మందికి దాదాపు 10లక్షల రూపాయలు నకిలీ పాసు పుస్తకాల ద్వారా రుణాలు పొంది బ్యాంకును మోసం చేశారని రాజాపూర్, బాలానగర్ బ్యాంకు మేనేజర్లు వేరువేరుగా బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నంబరు 323/2015 ఐపిసి 420,468,471, క్రైం నంబరు 322/2015 ఐపిసి 420, 468, 471 ప్రకారం వేరు వేరు రెండు కేసు నమోదు చేసి బాలానగర్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నియమ నిబంధనల ప్రకారం రుణాలను మంజూరు చేసే సమయంలో రైతులు ఇచ్చే పాసు పుస్తకాలు, టైటిల్ డిడ్స్, పహాణి, ఆర్‌వోఆర్, రక్షత కౌలుదారు వంటి రికార్డులను బ్యాంకు మేనేజరు, ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలించి యజమాన్యత్వం గురించి లీగల్ ఒపినియన్ బ్యాంకు కేటాయించిన న్యాయవాదితో తీసుకుని రుణాలను మంజూరు చేయాలి. వాస్తవికంగా రికార్డులలో చూయించిన వ్యవసాయ పొలాలలో ఎవరు పంటలు పండిస్తున్నారో అనే విషయాలను పరిశీలించి రుణాలను పొందే రైతులు వారి ప్రవర్తన మరియు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని తిరిగి సకాలంలో బ్యాంకుకు చెల్లించగలరా అనే విషయాలను స్పష్టంగా ఆగ్రామంలో విచారించి అన్ని నియమ నిబంధనలను సక్రమంగా ఉన్నాయని పూర్తి నమ్మకం ఏర్పడిన తరువాతనే బ్యాంకు రుణాలను ఫీల్డ్ ఆఫీసర్, బ్యాంకు మేనేజరు మంజూరు చేస్తారు. దీంతోపాటు బ్యాంకు అధికారుల ఫిర్యాదులో నకిలీ పాసు పుస్తకాలు సమర్పించి రుణాలను పొంది బ్యాంకుకు మోసం చేశారని బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనేక అనుమానాలకు దారితీస్తోంది. బ్యాంకుకు సమర్పించిన పాసు పుస్తకాలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని రెవెన్యూ రికార్డులను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను పాటించకుండానే రైతులకు ఏకంగా రెండు బ్యాంకు అధికారులు దాదాపు 10లక్షల రూపాయల రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకు అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉంది. రుణాలు 2011 తీసుకుని తిరిగి చెల్లించలేదని, అందువల్ల వీరి రికార్డులను పరిశీలించినప్పుడు నకిలీ పాసు పుస్తకాలుగా గుర్తించినట్లు బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. అయినప్పటికి రెవెన్యూ రికార్డులకు సంబంధించిన పాసు పుస్తకాలు రెవెన్యూ అధికారులు తహశీల్దార్ కార్యాలయం నుండి జారీ చేశారా..? లేక నకిలీ పాసు పుస్తకాలను తయారు చేశారా..? నకిలీ పాసు పుస్తకాలు, టైటిల్ డిడ్‌పై వ్యవసాయ పొలాల వివరాలు తహశీల్దార్ సంతకం, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ సంతకాలు ఎవరు చేశారు..? తహశీల్దార్ కార్యాలయం సిబ్బందా..? లేక ఇతరులా..? వీరితోపాటు ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది.. అనే విషయాలు పోలీసుల విచారణలో తేలుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాదాపు రుణాలు పొంది నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత నకిలీ పాసు పుస్తకాలని బ్యాంకు అధికారులు నిర్దారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుణాలను మంజూరు చేసే సమయంలో బ్యాంకు అధికారుల పాత్ర ఏమిటి.. దీంతోపాటు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరిచ్చారు.. వాటిపై సంతకాలు ఎవరివి.. అనే విషయాలను పోలీసులు విచారించాల్సి ఉంది. నకిలీ పాసు పుస్తకాలతో రెండు బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన సంఘటనలో బ్యాంకు అధికారులు, రెవెన్యూ కార్యాలయం సిబ్బందిపై అనుమానాలకు దారితీస్తోంది.