ఆంధ్రప్రదేశ్‌

రివర్స్ టెండరింగ్ వల్ల వెయ్యికోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:తమ ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రభుత్వానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిర్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళితే ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, అధికారంలోకి నాలుగు నెలలైనా ఏవిధమైన పనులు చేయటం లేదని విమర్శలు చేస్తున్నారని, గత ప్రభుత్వం హయాంలో రెండేళ్ల అయినా ఏ ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదని గుర్తుచేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏవైనా నిర్మాణాలకు, సంక్షేమ కార్యక్రమాలకు వాడవచ్చని చెప్పారు.